శ్రీ హరిహర క్షేత్రంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల అంకురార్పణ

0
4

ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలు ప్రారంభించిన   మాజీమంత్రి శిద్దా రాఘవరావు దంపతులు.

చిమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో నేటి నుండి తొమ్మిది రోజులపాటు దసరా  శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి.

దసరా శరన్నవరాత్రులు తొలిరోజు ప్రాతఃకాలంలో  క్షేత్రంలో కొలువైఉన్న సకల దేవతలకు విశేష అలంకారాలు, పూజలు మరియు  శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి అమ్మవారికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు,శ్రీ చక్రార్చన భక్తిశ్రద్ధలతో, వేద పండితులు, ఆలయ అర్చకులు నిర్వహించారు..

మాజీమంత్రి శిద్దా రాఘవరావు శ్రీ హరిహర క్షేత్రంలో కొలువైన సకల దేవతలకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి అలంకారంలో వేంచేసి ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు.రెండవ రోజు మంగళవారం అమ్మవారు శ్రీ కంచి కామక్షి దేవి అలంకరణ తో భక్తులకు దర్శనం ఇస్తారని అర్చకులు తెలిపారు.

ఉభయ దాతల ఆధ్వర్యంలో కుంకుమ అర్చన,ఆర్యవైశ్య మహిళలచే సామూహిక శ్రీ లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.దసరా శ్రీ దేవి శరన్నవరాత్రులు పునస్కరించుకొని శ్రీ హరిహర క్షేత్రం శోభాయమానంగా అలంకరించారు.విద్యుత్ కాంతులతో క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారి దర్శన భాగ్యం కోసం మహిళా భక్తులు తరలి వచ్చారు.ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం శర్మ,హరి కుమారా చార్యులు,హరికృష్ణ శర్మ శ్రీనివాసా చార్యులు, వెంకటేశ్వరా చార్యులు భక్తులకు తీర్థప్రసాదాలు అందచేసారు. ఆలయ ఇంచార్జ్ ఎమ్.వెంకటేశ్వర్లు కార్యక్రమ పర్యవేక్షణ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శిద్దా పాండురంగారావు దంపతులు, శిద్దా వెంకటేశ్వర్లు,శిద్దా పెద్ద బాబు,శిద్దా వెంకటేశ్వర్లు,శిద్దా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో. దసరా శరన్నవరాత్రులు పునస్కరించుకుని భక్తులకు తీర్థప్రసాదాలు  ఏర్పాటు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here