సంచలన విషయం వెల్లడించిన WHO..?

0
3

అలా సెక్స్ చేసిన వారిలోనే మంకీపాక్స్ అధికం, సంచలన విషయం వెల్లడించిన WHO

ఇద్దరు పురుషులు శృంగారంలో పాల్గొంటే, వారిలోనే అత్యధికంగా మంకీపాక్స్ కేసులు నమోదువుతున్నాయని WHO వెల్లడించింది

వీరే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు..

మంకీపాక్స్ కేసులు అంతర్జాతీయంగా పెరుగుతుండటం వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇప్పటి వరకూ 75 దేశాల్లో 16 వేల కేసులు నమోదయ్యాయి. అయితే WHOకేసులు పెరుగుదలపై స్పందించింది. పురుషుల్లోనే ఎక్కువగా మంకీపాక్స్ వైరస్ కనిపిస్తోందని వెల్లడించింది. అంతే కాదు. మరో సంచలన నిజాన్నీ బయటపెట్టింది. ఓ పురుషుడు, మరో పురుషుడితో శృంగారంలో పాల్గొంటే, వారికే ఈ వైరస్ తొందరగా సోకుతోందని స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు రక్షణ చర్యలు చేపడితే..తొందరగానే వ్యాప్తిని అడ్డుకోవచ్చని తేల్చి చెప్పింది. సౌత్ ఈస్ట్ ఏసియాలోని దేశాలు మంకీపాక్స్‌పై అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. “గతంలో ఎప్పుడూ ఈ కేసులు నమోదు కాని చోట కూడా మంకీపాక్స్ వ్యాప్తి చెందుతోంది. ఇది కచ్చితంగా దృష్టి సారించాల్సిన విషయం. పురుషుల మధ్య శృంగారం జరిగితే, వారిలోనే ఎక్కువగా వైరస్ కనిపిస్తోంది” అని వెల్లడించింది. మొత్తం 16 వేల కేసుల్లో సౌత్ ఈస్ట్ ఆసియాలో నాలుగు కేసులు  నమోదయ్యాయి. భారత్‌ నుంచే మూడు కేసులు వెలుగులోకి రాగా, థాయ్‌లాండ్‌లో ఒక కేసు నమోదైంది. మధ్యప్రాచ్య దేశాల నుంచి భారత్‌కు వచ్చిన వారిలోనే ఈ లక్షణాలు కనిపించాయి. “వ్యాధి నియంత్రణ ఒక్కటే కాదు. మానసికంగా ఎవరూ ఆందోళన చెందకుండా, ఎవరూ వివక్షకు గురి కాకుండా చూడటమూ ముఖ్యమే” అని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 

అత్యవసర చర్యలు చేపట్టాల్సిందే..

మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో WHO డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. “అంతర్జాతీయంగా చూస్తే ఈ వైరస్ వ్యాప్తి ఇంకా ఉద్ధృతం కాలేదు. ఏదేమైనా కేసులైతే పెరుగుతున్నాయి. ఈ వైరస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. అందుకే మనమంతా అప్రమత్తంగా ఉండాలి. ఇది ఇంకా వ్యాప్తి చెందకుండా నియంత్రించాలి” అని WHOసూచిస్తోంది. తొలి కేసు నమోదైనప్పటి నుంచే WHO అన్ని దేశాలనూ అప్రమత్తం చేసింది. ఎంత ప్రమాదకరమో సమీక్షించి చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజారోగ్యాన్ని పరిరక్షించే చర్యలు చేపట్టాలని చెప్పింది. ఇప్పటికే వ్యాధి సోకిన వారిని కాపాడుకోవటం, క్లినికల్ మేనేజ్‌మెంట్, వ్యాక్సిన్‌ల విషయమై లోతైన పరిశోధనలు లాంటివి అవసరమని అంది. ఇక భారత్‌లో కేరళలో రెండు కేసులు నమోదు కాగా, ఇటీవల దిల్లీలోనూ తొలి మంకీపాక్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ట్రావెల్ హిస్టరీ లేని వ్యక్తికీ ఈ వైరస్ సోకటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అటు పశ్చిమ బెంగాల్‌లోనూ ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here