సపర్యలు చేసి కాపాడిన ప్రధాని కార్యాలయ సిబ్బంది..

0
3

 ఎగరలేక కిందపడిపోయిన బ్లాక్ కైట్ పక్షి..

డీ హైడ్రేషన్ కారణంగా కిందపడిపోయిన బ్లాక్ కైట్ (రాబందు) పక్షిని ప్రధాని నరేంద్ర మోడీ నివాస సిబ్బంది రక్షించారు. ప్రస్తుతం పక్షి వైద్యుల పరిశీలనలో ఉందని, ఫిట్‌గా ఉన్నట్లు నిర్ధరణ అయ్యాక అడవిలో..

డీ హైడ్రేషన్ కారణంగా కిందపడిపోయిన బ్లాక్ కైట్ (రాబందు) పక్షిని ప్రధాని నరేంద్ర మోడీ నివాస సిబ్బంది రక్షించారు. ప్రస్తుతం పక్షి వైద్యుల పరిశీలనలో ఉందని, ఫిట్‌గా ఉన్నట్లు నిర్ధరణ అయ్యాక అడవిలో వదిలేస్తామని వైల్డ్‌లైఫ్ అధికారులు వెల్లడించారు. డీ హైడ్రేషన్ కారణంగా మంగళవారం ఉదయం ఎగరలేక రాబందు అనే పక్షి నేలపై కూర్చుని ఉంది. దీనిని ప్రధాని నివాసం భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే వైల్డ్‌లైఫ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్నాక ఇద్దరు సభ్యుల రెస్క్యూ టీమ్ ఆ పక్షికి తాగునీరు అందించింది తర్వాత దానిని జాగ్రత్తగా అబ్జర్వేషన్ లో ఉంచి, కోలుకున్నాక అడవిలో వదిలేస్తామని చెప్పారు.

ఢిల్లీ-మహానగర పరిధిలో పక్షులను కాపాడాలనే ఫోన్ కాల్స్ తరచూ వస్తున్నాయని వైల్డ్ లైఫ్ అధికారులు వెల్లడించారు. ఇది సంక్లిష్టమైన పరిస్థితి కానప్పటికీ, పక్షులకు భూమిపై నీటి లభ్యత లేకపోవడం వల్ల అవి అనారోగ్యానికి గురవుతున్నాయన్నారు. తద్వారా అవి నిర్జలీకరణం చెంది ఎగరలేక కిందపడిపోతున్నాయని వివరించారు. ఏది ఏమైనప్పటికీ.. ఈ విశాల భూ మండలంపై మనుషులకు జీవించే హక్కు ఎంత ఉందో మిగతా జీవులకూ ఆ హక్కు అంతే ఉందన్న విషయాన్ని గ్రహించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here