సమకాలీన రాజకీయ పరిస్థితులు

0
9

సమకాలీన రాజకీయ అంశాలు,పార్టీ బలోపేతం పై చర్చ…జిల్లా రాజకీయాలపై చర్చ చేసిన ఇద్దరు నేతలు..
సమకాలీన రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర రాజకీయాలు,జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, తెలుగు దేశం పార్టీ ని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి అవసరమైన చర్యల గురించి ఒంగోలు పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు డా.నూకసాని బాలాజీ, మాజీ శాసన సభ్యుడు పోతుల రామారావు చర్చించు కున్నారు. శుక్రవారం టంగుటూరు లో ని పోతుల రామారావు నివాసం లో భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా జరిగిన భేటీలో జిల్లా, తో పాటు కొండపి నియోజకవర్గం పరిస్థితులు పలు రాజకీయ అంశాలపై చర్చించారు. జిల్లా లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై వారివురు లోతుగా సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత జిల్లా,రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ రాజకీయాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా నూకసాని బాలాజీ పోతుల రామారావు తో 20 సంవత్సరాలకు పైగా రాజకీయ అనుబంధం ఉందని తన శ్రేయోభలాషి అని తన అనుభవాలను నెమరు వేసుకున్నారు. పోతుల రామారావు , నూకసాని బాలాజీ లు పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం తో పాటు పార్టీ ఇచ్చిన బాదుడే బాదుడు కార్యక్రమం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here