సమస్యలపై వైసీపీ నేతలను నిలదీయండి

0
6

కందుకూరు పట్టణంలో ఏ వార్డుకు వెళ్లినా, కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోందని నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 28వ వార్డులో శుక్రవారం ఆయన పర్యటించారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు దివి శివరాం గారితో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైసిపి పాలనలో మోసాలు, దుర్మార్గాలపై వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ అనేక వార్డుల్లో సరైన రోడ్లు, డ్రైనేజీ వసతి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఎక్కడికి వెళ్లినా వీటి గురించే ప్రజలు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. సైడ్ కాలువల నిర్మాణం లేక రోడ్లపైనే మురుగునీరు నిలుస్తోందని, ఖాళీ ప్లాట్లలో మురికి నీరు నిలిచిపోయి దోమలు, పందులతో జనం అల్లాడుతున్నారని అన్నారు. టిడిపి హయాంలో ప్రతి వార్డులో సిమెంట్ రోడ్లు, సైడ్ కాలులు నిర్మించారని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి జాడే లేదన్నారు. జగనన్న కాలనీల పేరుతో ఊరికి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారని విమర్శించారు. గడపగడపకు అంటూ వచ్చే స్థానిక ఎమ్మెల్యేని ప్రజలు తమ సమస్యలపై నిలదీయాలని నాగేశ్వరరావు సూచించారు. తెలుగుదేశం పరిపాలనలో నిత్యవసర వస్తువులు ధరలు ఎలా ఉండేవో, జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రేట్లు ఎంతగా పెరిగాయో ప్రజలు గుర్తించాలన్నారు. ముఖ్యమంత్రి అప్పుల మీద అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని చీకట్లోకి తీసుకు వెళుతున్నారని, చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలరని నాగేశ్వరరావు అన్నారు. రాబోయే ఎన్నికల్లో కందుకూరులో టిడిపి జెండా ఎగిరేలా ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దివి శివరాం మాట్లాడుతూ ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ప్రతిపక్షాలపై దాడులు జరుగుతున్నాయని, వైసీపీ నేతలే తప్పులు చేసి తమ పార్టీ నేతలపై బురద జల్లటం సిగ్గుచేటని అన్నారు. వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులు కామపిశాచులుగా మారి మహిళలను వేధిస్తున్నారని, ప్రజలంతా వారి ఆగడాలను గమనిస్తున్నారని అన్నారు. ప్రజలు వాస్తవాలు గ్రహించి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని దివి శివరాం కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, వార్డు అధ్యక్షుడు పాలంకి ప్రసాదు, వార్డు నాయకులు చవిడిబోయిన శివకృష్ణ, కొత్తగొర్ల వసంత, పెరుగు వరలక్ష్మి, బక్కమంతల మమత, గోకరాజు అంకమ్మ, వెంకటరత్నం, పూనూరి మాధవి, బక్కమంతల మనోజ్, చీదెళ్ల నాని, చవిడిబోయిన రాజు, చిన్నపోలయ్య, బక్కమంతల అశోక్, రాయి శ్రీను, రాయి రవితేజ, అప్పనబోయిన నాగరాజు, పూనూరి సాయి, పామర్తి మహేంద్ర, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు నాదెండ్ల సుబ్బారావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శ్రీను, పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు పసుపులేటి శ్రీను, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ సలాం, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పులి నాగరాజు, ఉపాధ్యక్షుడు రవిచంద్ర, పట్టణ మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి కల్లూరి శైలజ, నాయకులు రెబ్బవరపు మాల్యాద్రి, నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు షేక్ శతాక్షి, ఆదెమ్మ, సరిత, మల్లవరపు,నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాయపాటి శ్రీనివాసరావు, సీత తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here