సముద్రతీరంలో మరో 2 మృతదేహాలు..

0
2
పూడిమడక సముద్రతీరంలో మరో 2 మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. నేవీ హెలికాప్టర్ సాయంతో మృతదేహాలను ఒడ్డుకు తరలించినట్లు చెప్పారు. మృతులు జగదీష్‌, గణేష్‌గా గుర్తించారు. ఇప్పటివరకు మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. విశాఖ సముద్రతీరంలో గల్లంతైన విద్యార్థుల కోసం ఉదయం నుంచే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. హెలికాప్టర్, కోస్ట్‌గార్డ్ నౌకలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. మరో నలుగురు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పూడిమడక బీచ్‌కు 15 మంది విద్యార్థులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here