సముద్ర తీరంలో మత్స్యకారుల బోటు బోల్తా..

0
29

ఎస్.యానాం సముద్ర తీరంలో మత్స్యకారుల బోటు బోల్తా , రంగంలోకి మెరైన్ పోలీసులు

కోనసీమ జిల్లా ఎస్.యానాం సముద్ర తీరంలో మత్స్యకారుల బోటు బోల్తా పడింది. బోల్తా పడిన బోటుపైకి ఎక్కి రక్షించాలని మత్స్యకారులు ఆర్తనాదాలు చేశారు.

కోనసీమ జిల్లా  ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం సముద్రంలో బోటు బోల్తా పడింది.  కాకినాడకు చెందిన  పది మంది మత్స్యకారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బోల్తా పడిన బోటుపై సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. సముద్రంలో ఆఫ్షోర్ లో ఉన్నటువంటి రిగ్గు వద్దకు వెళుతున్న హెలికాప్టర్ నుంచి మత్స్యకారులను పైలట్, రవ్వ కేయిర్న్ ఎనర్జీ సంస్థ అధికారులు గమనించారు. మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్.యానాం ఒ.ఎన్.జి.సి హెలికాప్టర్ సాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు మెరైన్ పోలీసులు. మత్స్యకారులను  హెలికాప్టర్ ద్వారా సురక్షితంగా కాకినాడ చేర్చారు మెరైన్ పోలీసులు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here