సర్కారు , గవర్నర్‌ మధ్య మాటల యుద్దం

0
5

తిరువనంతపురం: కేరళలో ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య దూరం మరింత పెరుగుతోంది. గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌కు, పినరయి విజయన్‌ సర్కారు మధ్య మాటల వివాదం కొనసాగుతోంది. వీసీల నియామకం విషయంలో గవర్నర్‌, సర్కారుకు మధ్య నెలకొన్న వివాదం మరో మలుపు తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి కె.బాలగోపాలన్‌ను కేబినెట్‌ నుంచి తొలగించాలని అర్థం వచ్చేలా సీఎం విజయన్‌కు గవర్నర్‌ లేఖ రాశారు. ఆర్థిక మంత్రి పట్ల తాను విశ్వాసం కోల్పోయాయని అందులో పేర్కొన్నారు. ఆ డిమాండ్‌ను సీఎం తోసిపుచ్చారు.

అక్టోబర్‌ 18న యూనివర్సిటీ ప్రాంగణంలో ఆర్థిక మంత్రి కె.బాలగోపాలన్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి వచ్చిన వారు కేరళ యూనివర్సిటీల్లో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోలేరని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని, జాతీయవాద భావనకు వ్యతిరేకంగా ఉన్నాయని  సీఎంకు రాసిన లేఖలో గవర్నర్‌ పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి తన విశ్వాసం కోల్పోయారని లేఖలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here