సినిమా వివాదం.. కోర్టుకు హాజరైన జీవితా రాజశేఖర్..

0
3

గరుడ వేగ సినిమా నిర్మాతలు, జోస్టర్ గ్రూప్ చైర్మన్ ఎం.డి చర హేమ, కోటేశ్వరరాజు… తమకు జీవితా రాజశేఖర్ 26 కోట్ల రూపాయలు బకాయిపడ్డారని..

.ప్రముఖ సీనియర్ హీరోయిన్ జీవితా రాజశేఖర్ (Jeevitha Rajashekar) చెక్ బౌన్స్ కేసులో గురువారం తిరుపతి జిల్లాలోని నగరి కోర్టుకు వెళ్లారు. తమకు జీవిత రాజశేఖర్ రూ. 26 కోట్లు ఇవ్వాలంటూ గరుడ వేగ సినిమా నిర్మాతలు జోస్టర్ గ్రూప్ చైర్మన్, ఎం.డి. కోర్టును ఆశ్రయించారు. వారి నుంచి తమ నగదు ఇప్పించాల‌ని పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు జీవితా రాజ‌శేఖ‌ర్‌కు నోటీసులు జారీ చేసింది. గత రెండేళ్లుగా ఆమె డబ్బులు ఇవ్వడం లేదని. అంతేకాకుండా ఆమె ఇచ్చిన చెక్ బ్యాంకులో డిపాజిట్ చేయగా బౌన్స్ అయ్యిందని వారు పిటిషన్‏లో పేర్కోన్నారు. దీంతో గురువారం చెక్ బౌన్స్ కేసులో నగరి కోర్టుకు హాజరయ్యారు జీవిత. త‌న న్యాయ‌వాదుల‌ను వెంట‌బెట్టుకుని కోర్టుకు వ‌చ్చారు. కోర్టు ఆవరణలో కొంత మంది అభిమానులు ఆమెతో ఫోటోలు దిగారు.

గరుడ వేగ సినిమా నిర్మాతలు, జోస్టర్ గ్రూప్ చైర్మన్ ఎం.డి చర హేమ, కోటేశ్వరరాజు… తమకు జీవితా రాజశేఖర్ 26 కోట్ల రూపాయలు బకాయిపడ్డారని.. అవి తిరిగి చెల్లించలేదని ఆమధ్య టీవీ9 వేదికగా ఆరోపణలు చేశారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఎన్నిసార్లు కోర్టు నుంచి నోటీసులు పంపినా జీవితా రాజశేఖర్ రిప్లై ఇవ్వడం లేదని విమర్శించారు. ఈ వ్యవ‌హారంపై గ‌తంలోనే స్పందించిన జీవిత‌… జోస్టర్ గ్రూప్ త‌మ‌పై తప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. జీవిత ఇచ్చిన చెక్‌ బౌన్స్ కావడంతో .. ఈక్రమంలోనే నగరి కోర్టు విచార‌ణ‌కు జీవిత స్వయంగా హాజ‌ర‌య్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here