మీరు దర్శనం రెండవ తారీఖున తీసుకుంటే ఒక రోజు ముందుగా అంటే ఒకటవ తారీఖున ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట లోపు JEO ఆఫీసులో సిఫార్సు లెటర్, మీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు,వారు ఒక ఫారం ఇస్తారు.అది పూర్తి చేసి ఇస్తే దాని మీద స్టాంపు వేసి ప్రక్క బిల్డింగ్ లోకి ఒక slip ఇస్తారు.అది తీసుకుని వచ్చేయండి.ఒక లెటర్ మీద ఆరుగురికి మాత్రమే దర్శనం అవకాశం.ఇస్తారు.అది తీసుకుని వచ్చేయండి. లెటర్ మీద ఆరుగురికి మాత్రమే దర్శనం అవకాశం.
వారు తనిఖీ చేసి లభ్యత, సిఫార్సు లెటర్ ఇచ్చిన వారి ప్రాముఖ్యత పరిగణలోకి తీసుకొని సాయంత్రం 6 గంటలకు మీ మొబైల్ కు మెసేజ్ వస్తుంది. ఆ మేసేజ్ వచ్చిన తర్వాత మీరు MBC 34 కి వెళ్ళి మెసేజ్, మీకు ఉదయం ఇచ్చిన slip చూపించి మనిషికి 500/- చొప్పున చెల్లించి టిక్కెట్లు తీసుకోగలరు.
మరుసటి రోజు ఉదయం వారు ఇచ్చిన సమయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 ద్వారా దర్శనానికి వెళ్ళవచ్చు..ఇప్పుడు ఈ దర్శనం కూడా గంట పడుతుంది.
గమనిక : శుక్ర,శని,ఆదివారం మరియు ప్రత్యేక పర్వదినాలలో బ్రేక్ దర్శనాలు ఉండవు. మరియు అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగిన పక్షంలో బ్రేక్ దర్శనాలు ముందస్తు సమాచారం లేకుండా రద్దు చేయవచ్చు.