సి.రంగరాజన్ కు 90 వ జన్మదిన శుభకాంక్షలు..

0
4

1932లో జన్మించిన చక్రవర్తి రంగరాజన్ భారత దేశానికి చెందిన ఆర్థిక వేత్త. 1964లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పి.హెచ్.డి.పట్టా పొందినాడు. ఇతడు దశాబ్దం కాలానికి పైగా 1982 నుంచి 1991 వరకు భారతీయ రిజర్వ్ బాంక్కు డిప్యూటీ గవర్నర్ గా పనిచేశాడు. ఆ తర్వాత 1992 డిసెంబర్ 22 నుంచి 1997 డిసెంబర్ 21 వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేశాడు. 1997, నవంబర్ 24 నుంచి 2003, జనవర్ 3 వరకు ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గాను పనిచేసాడు. ఆ తర్వాత 12 వ ఆర్థిక కమీషన్ చైర్మెన్ గా పదవి చేపట్టాడు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా కౌన్సిల్ చైర్మెన్ పదవిలో కొనసాగి రాజీనామా చేశాడు. తాజాగా 2008, ఆగష్టు 13న రాజ్యసభకు నియమితుడయ్యాడు. ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న సమయంలో 1998 నుంచి 1999 వరకు ఒడిషా గవర్నర్ గా, 2001 నుంచి 2002 వరకు తమిళనాడు గవర్నరుగా అదనపు బాధ్యతల్ని చేపట్టాడు.

2002లో భారత ప్రభుత్వం అతనికి రెండో అత్యున్నత పౌర అవార్డు అయిన పద్మ విభూషణ్తో సత్కరించింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here