సీఎం జగన్‌కు రాఖీ శుభాకాంక్షలు నేరుగా చెప్పొచ్చు.. వివరాలివే

0
6

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నేరుగా రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ట్వీట్రాఖీ పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. సోదరులకు సోదరీమణులు రాఖీలు కడుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ రాఖీ పండుగ నాడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నేరుగా శుభాకాంక్షలు తెలపాలనుకునేవారికి మంచి అవకాశం దక్కింది. దీని కోసం చిన్న పనిచేస్తే చాలు.. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ట్వీట్ చేసింది. కింది సూచనలను అనుసరించాలని తెలిపింది.మొదటగా శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నవారు..

శుభాకాంక్షలు తెలియజేస్తూ వీడియోను రికార్డును చేయాలి. అల రికార్డు చేసిన వీడియోను వాట్సాప్‌ స్టేటస్‌లో కానీ ఇతర సోషల్‌ మీడియా పేజీల్లో కానీ అప్‌లోడ్‌ చేయాలి.. ఆ తర్వాత 7890689927 నెంబర్‌కు రికార్డు చేసిన వీడియోను పంపాలని వైఎస్సార్‌సీపీ తెలిపింది.

వైఎస్ జగన్ అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.‘ఈ రాఖీ పండుగ నాడు మీ అభిమాన సోదరుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్న గారికి మీరే ప్రత్యక్షంగా శుభాకాంక్షలు .తెలపాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు వెంటనే మీ సందేశాన్ని సీఎం వైయస్ జగన్ గారితో పంచుకోవడానికి ఈ క్రింది విధంగా అనుసరించండి’అంటూ ఆ వివరాలను వైఎస్సార్‌సీపీ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here