సీఎం జగన్‌ను కలిసిన రోజా దంపతులు

0
4

మంత్రి రోజా దంపతులు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన సొంత నియోజకవర్గం నగరిలో తనకు అసమ్మతి వర్గంగా తయారైన పార్టీ నేతలపై ఆమె జగన్ కు ఫిర్యాదు చేశారు. నియోకజవర్గంలో తనను బలహీనపరిచే దిశగా అసమ్మతి నేతలు కార్యక్రమాలు చేపడుతున్నారని, ఫలితంగా పార్టీ పరువు పోతోందని ఆమె జగన్ కు ఫిర్యాదు చేశారు. 

ఇటీవల పార్టీ కార్యకర్తలతో ఫోన్ లో మాట్లాడుతూ ఇలాగైతే రాజకీయాలు చేయడం కష్టమేనంటూ రోజా చేసిన వ్యాఖ్యలు లీకైన సంగతి తెలిసిందే. ఈ నెల 16న రోజాకు సమాచారం ఇవ్వకుండానే నగరి పరిధిలో ఆర్బీకే, వెల్ నెస్ కేంద్రాలను అసమ్మతి నేతగా ఉన్న చక్రపాణి రెడ్డి వర్గం ప్రారంభించింది. ఈ విషయం తెలుసుకున్న రోజా తన అనుచరులతో మట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపైనే ఆమె సీఎం జగన్ కు ఫిర్యాదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here