సైనికుడి విగ్రహానికి రాఖీ కట్టిన మహిళ..

0
6

కన్నీరు పెట్టించే కథ ఏమిటంటే..

అన్నదమ్ములకు రాఖీ కట్టే శుభసమయం కోసం అక్క చెల్లెల్లు ఏడాది కాలం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు. శ్రావణ పౌర్ణమి రోజున సోదరుడి రాఖీని కట్టి.. వారి నుంచి రక్షణ కోరుతూ సంతోషము వ్యక్తం చేస్తారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. సెలబ్రెటీలు, రాజకీయ నేతల నుంచి సామాన్యుల వరకూ రాఖీ పండగను అంగరంగ వైభంగా జరుపుకుంటున్నారు. అయితే తాజాగా ఓ సోదరి.. తన సోదరికి రాఖీ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అంతేకాదు.. ఆ చిత్రం.. చూసిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవింపజేసి .. కంట కన్నీరు పెట్టేలా చేస్తుంది. దేశ రక్షణ కోసం సరిహద్దు ప్రాంతాల్లో కావలా కాస్తూ.. శత్రువుల చేతిలో అమరుడయ్యాడు ఓ జవాన్.. అతని విగ్రహానికి రాఖి పండగ సందర్భంగా సోదరి రాఖీ కట్టింది. ఈ హృదయ విదారక ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే..

వేదాంత్ బిర్లా లింక్డ్‌ఇన్‌లో షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కట్టిన హృదయాన్ని కదిలించే చిత్రం కనిపిస్తుంది. ఈ ఫొటోలో ఆర్మీ జవాన్ విగ్రహం కనిపిస్తుంది. తుపాకీ పట్టుకుని గుండెల నిండా దైర్యం నింపుకున్న తన సోదరుడి విగ్రహానికి ఒక మహిళ రాఖీ రోజున రాఖీ కట్టింది. ఆ సైనికుని పేరు షాహీద్ గణపత్ రామ్ కద్వాస్రా. జోధ్‌పూర్‌లోని ఓసియన్‌లోని ఖుడియాల గ్రామానికి చెందిన గణపత్ జమ్మూ కాశ్మీర్‌లో శత్రువులను అడ్డుకునే సమయంలో 24-09-2017న ప్రాణాలు కోల్పోయిన ధైర్యవంతుడు. దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన షాహీద్ గణపత్ కి గుర్తుగా రాజస్థాన్ లో విగ్రహం ఏర్పాటు చేశారు. గుర్తు తెలియని మహిళ గణపత్ మణికట్టుకు రాఖీ కట్టి, ‘రక్ష’ సారాన్ని గౌరవించింది. ఈ పోస్టు చూసిన నెటిజన్లు తీవ్ర ఆవేదన చెందారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి దేశసేవ చేస్తోన్న సైనికులకు సలాం కొట్టారు.

ఈ పోస్ట్ 3k పైగా కామెంట్స్ ను సొంతం చేసుకుంది. దేశాన్ని రక్షించడం కోసం తమ ప్రాణాలను అర్పించిన సైనిక సిబ్బందికి అనేక మంది నెటిజన్లు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here