సొమ్మును కాజేస్తున్న ఆన్ లైన్ ముఠాలు..

0
8

విద్యుత్ బకాయిల పేరుతో వినియోగదారుల సొమ్మును కాజేస్తున్న ఆన్ లైన్ ముఠాలు..ఈ మోసాల నుండి వినియోగదారులు అప్రమత్తంగా వుండాలన్న నెల్లూరు జిల్లా విద్యుత్ శాఖా S.E కె.విజయ కుమార్ రెడ్డి.

కరెంటు బిల్లు బకాయిలు ఉన్నారంటూ ఎస్ఎంఎస్ పంపించి డబ్బులు దోచుకునే ఆన్ లైన్ ముఠాలు ఎక్కువైనయని విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ కె విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ఆన్లైన్ మోసాలు చేసేవారు ఎలా ఉన్నారంటే మొదట మనకు ఒక ఎస్ఎంఎస్ పంపుతారు మీ కరెంటు బిల్లు బకాయి ఉన్నారు కనుక మీ కరెంటు కట్ చేస్తున్నావు అని ఎస్ఎమ్ఎస్ పంపుతారు మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఎలక్ట్రిసిటీ అధికారి కి ఫోన్ చేయండి అని ఒక నెంబర్ ఇస్తారు ఈ విధంగా మెసేజ్ వస్తుంది .మనం బిల్లు చెల్లించి ఉన్న ఇంకా చెల్లించకపోయినా ఎస్ఎంఎస్ చూస్తానే సహజంగా కొంచెం భయమేస్తుంది వెంటనే ఎస్ఎంఎస్ లో ఉన్న ఫోన్ నెంబర్ కు ఫోన్ చేస్తాం అవతల వ్యక్తి ఎలక్ట్రిసిటీ అధికారిగా పరిచయం చేసుకుంటారు మీరు భయపడాల్సిన పనిలేదు అని చెప్పి ఓ ఆన్ లైన్ లింక్ పంపిస్తున్నాను ఆ లింకు ద్వారా మీరు బిల్లు కట్టవచ్చని చాలా అభిమానంగా చెప్తాడు కరెంటు కట్ చేస్తారని భయంతో ఉన్న ప్రజలు ఆ లింకును క్లిక్ చేసి డబ్బులు చెల్లిస్తారు మనం డబ్బు పంపిన లింకు ద్వారా సైబర్ నేరగాళ్లు వెంటనే మన అకౌంట్ లోనే డబ్బులు ఖాళీ చేస్తున్నారు.డబ్బు కట్ అయిన తర్వాత మనకు బ్యాంకు నుంచి ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు కానీ మనకు తెలిసే అవకాశం ఉండదు. తర్వాత బ్యాంకుకు పోయి ఫిర్యాదు చేసిన పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా మన ఎస్పీడీసీఎల్ లో ఈ తరహా ఎస్ఎంఎస్ రావడం మొదలైంది ,ఎస్ఎంఎస్ లోని సెల్ నెంబర్ కు ఫోన్ చేస్తే ఎలక్ట్రిసిటీ అధికారిని చెప్పి పరిచయం చేసుకున్నాడు ఓ లింకు పంపుతానని చెప్పి ఆ లింకు ద్వారా బకాయి చెల్లిస్తే కరెంట్ సరపరా కొనసాగిస్తమంటూ హామీ ఇచ్చాడు. అతను ఏ ప్రాంత అధికారో ,ఎక్కడ పని చేస్తున్నారు అని ప్రశ్నించగానే లైన్ కట్ చేశాడు. వచ్చిన ఎస్ఎంఎస్ లో పేర్కొన్న నెంబర్కు ఫోన్ చేస్తే ఐ విల్ కాల్ యు లేటర్ అనే ఎస్ఎంఎస్ వచ్చింది. తర్వాత రెండు మూడు గంటల తర్వాత ఫోన్ చేసి మాట్లాడాడు అంటే వెంటనే ఫోన్ చేస్తే ఫోన్ రికార్డ్ చేసుకుంటారని అనుమానంతో బిజీ అన్నట్టు నమ్మించి తర్వాత ఏదో ఒక సమయంలో ఫోన్ చేసి లింకు పంపుతాం అంటున్నారట . ఒక పద్ధతి ప్రకారం మోసం చేయడమే లక్ష్యంగా చేసుకొని బ్యాంక్ అకౌంట్ లోని డబ్బులు దోచుకునే కొత్త రకం మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండటమే అవసరమని ఎస్. ఈ.గారు తెలిపారు. వీలైతే ఎస్ఎంఎస్ లో పేర్కొన్న నెంబర్ ఫోన్ చేసేటప్పుడు ఫోన్ ద్వారా రికార్డ్ చేసుకునే అలవాటు చేసుకోవాలని ఎస్. ఈ. గారు సూచించారు. అంతేకాక అనధికారకంగా వచ్చే లింకులను ఓపెన్ చేయకుండా ఉండాలని అనుమానం ఉన్నప్పుడు వెంటనే తమ కార్యాలయాలకు ఫిర్యాదు చేయడం మంచిదని వారు తెలిపారు .అదే విధంగా ఏదో ఒక నెంబర్ నుంచి మీ కరెంట్ కనెక్షన్ కట్ చేస్తామని ఎస్ఎంఎస్ రాగానే తమ సిబ్బందిని సంప్రదించి నిజా నిజాలు తెలుసుకోవడం అవసరమని ఎస్.ఈ. గారు తెలిపారు . ఈ తరహా మోసాలు ఎక్కువగా ఉన్నాయని ఎస్పీడిసియల్ అధికారులు పోలీస్ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. జిల్లాలోని అధికారులను కూడ అప్రమత్తం చేశామని అలాగే ప్రజలను చైతన్యపరిచేందుకు ఈ రోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here