సోదరుడు పార్టీ మారితే, తనకేం సంబంధం.

0
3
komatireddy fires on revanth reddy

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తక్షణమే తనకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి చేసిన ‘బ్రాందీ షాపు’ వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారితే.. తనకేం సంబంధం అని ఆయన ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డికి 56 ఏళ్ల వయసు అని గుర్తు చేశారు. ఆయన చిన్న పిల్లాడు కాదని.. ఆయనకు తోచిన నిర్ణయం ఆయన తీసుకున్నాడని పరోక్షంగా చెప్పారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారితే ఆయణ్ని విమర్శించాలి గానీ.. ‘మీరు’ అని సంబోధిస్తూ తనను కూడా తిట్టడం ఏంటని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు.

‘నేనొక తెలంగాణ ఉద్యమకారుణ్ని. 34 ఏళ్లుగా పార్టీ కోసం నా జీవితాన్ని ధారపోసిన వ్యక్తిని. రేవంత్ రెడ్డి అలా మాట్లాడటం తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన మాట్లాడిన మాటలు నిన్నటి నుంచి చాలా బాధించాయి. బ్రాండ్ కాదు.. బ్రాందీ షాపు పెట్టుకునే వాళ్లు అని అనడం సమంజసమా? టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం తప్పు’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం (ఆగస్టు 3) సాయంత్రం కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో దూకుడు పెంచిన ఈడీ అధికారులు.. ఢిల్లీలోని యంగ్ ఇండియన్ సంస్థ కార్యాలయాన్ని సీల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం, సోనియా గాంధీ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సోనియా గాంధీకి మద్దతుగా ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ధర్నాకు దిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here