స్కూటర్‌పై ఆఫీసుకి వెళ్ళిన కేంద్ర మంత్రులు.. ఫోటో వైరల్

0
13

Smriti Irani: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్వయంగా స్కూటర్ నడుపుతూ ఆఫీసుకి వెళ్ళారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

  • స్మృతి ఇరానీ స్వయంగా స్కూటర్ నడుపుతోన్న సమయంలో కేంద్ర సహాయ మంత్రి భారతీ పవార్ ఆమె వెనుక సీటులో కూర్చున్నారు. భారతీ పవార్ చేతిలో జాతీయ జెండా కూడా ఉంది. స్కూటర్ వెనుక కూడా జాతీయ జెండాను కట్టారు. భారతీ పవార్‌ను ఆమె ఆఫీసు వద్ద డ్రాప్ చేశానని స్మృతి ఇరానీ తెలిపారు
  • ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన హర్ ఘర్ తిరంగాలో భాగంగా జాతీయ జెండాలతో స్కూటర్‌పై వెళ్తున్నట్లు స్మృతి ఇరానీ చెప్పారు. స్కూటర్‌పై వెళ్తున్న సమయంలో ఇద్దరు మంత్రులూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ హెల్మెట్లు కూడా ధరించారు. కాగా, ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా దేశ ప్రజలు తమ ఇళ్ళపై ఆగస్టు 13 నుంచి 15 వరకు జాతీయ జెండాను ఎగరవేయాలని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.అలాగే, సామాజిక మాధ్యమాల్లో డీపీలుగా జాతీయ జెండా ఫొటోలను పెట్టుకోవాలని ఆయన చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here