స్కూల్లో విద్యార్థుల వింత ప్రవర్తన..

0
2

ఉత్తరాఖండ్‌లోని  అరుస్తూ.. తలలు బాదుకుంటూ.. దొర్లుతూ ఏడుస్తున్న విద్యార్థులు..!

ఉత్తరాఖండ్‌లోని ఓ స్కూల్లో విద్యార్థుల ప్రవర్తన అందరిని ఆందోళనలో పడేసింది. ఏ కారణంగా లేకుండా కొంతమంది విద్యార్థులు విపరీతంగా ఏడుస్తున్నారు. తలలు బాదుకుంటూ.. కింద పడి దొర్లుతూ విలపిస్తున్నారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దాంతో స్కూల్లో పూజలు చేయాలని, లేదంటే నాశనం అవుతుందని పట్టుబడుతున్నారు. అయితే వైద్య నిపుణులు మాత్రం దీనిని మాస్ హిస్టిరియాగా చెబుతున్నారు. అయితే గతంలో కూడా అక్కడ ఇలా జరిగిందట.

  • ఆందోళనలో తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం
  • మాస్ హిస్టిరియా అంటోన్న వైద్య నిపుణులు
  • స్కూల్లో పూజలు చేయాలంటోన్న తల్లిదండ్రులు

ఓ స్కూల్లో విద్యార్థులు వింతగా ప్రవర్తిస్తున్నారు. బోరున ఏడుస్తున్నారు. గట్టిగా అరుస్తున్నారు. తలలు బాదుకుంటున్నారు. కిందపడి దొర్లుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ జిల్లాలోని రైఖిలి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చాలామంది విద్యార్థులు ఎక్కువగా బాలికలు ఇలా అసాధారణంగా ప్రవర్తిస్తున్నారు. పిల్లలు ఇలా ప్రవర్తించడంతో పాఠశాల అధికారులతో పాటు తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. మంగళవారం మొదటిసారిగా విద్యార్థుల్లో ప్రవర్తనలు తేడా గమనించామని స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు విమ్లా దేవి చెప్పారు. ఎటువంటి కారణం లేకుండానే వారు ఏడుస్తున్నారని, తలలు కొట్టుకుంటున్నారని ఆమె తెలియజేశారు. దాంతో విషయం వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. వారు స్థానికంగా ఉండే ఓ పూజారిని పిలిచారని, ఆ రోజు పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. అడ్మినిస్ట్రేషన్, డాక్టర్ల బృందం గురువారం పాఠశాలను సందర్శించినప్పుడు విద్యార్థుల్లో అసాధారణ ప్రవర్తన గమనించారని చెప్పారు.

అయితే పాఠశాలలో ఏదో సమస్య ఉందని, స్కూల్లో పూజలు నిర్వహించాలని తల్లిదండ్రులు పట్టుబట్టారు. “పాఠశాల క్యాంపస్‌లో పూజలు నిర్వహించాలని తల్లిదండ్రులు పట్టుబట్టారు. లేదంటే పాఠశాల నాశనమవుతుందని వారు నమ్ముతున్నారు. అయితే వైద్యులను సంప్రదించి మేము ఏదైనా చేస్తాం. పరిస్థితి అదుపులోకి వస్తుంది.” అని విమ్లా దేవి చెప్పారు. అయితే విద్యార్థులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారనేదానిపై స్పష్టత లేదు. అయితే ఇది ‘మాస్ హిస్టీరియా’గా కనిపిస్తోందని మానసిక వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే స్కూల్లో మూడేళ్ల క్రితం కూడా ఇలా జరిగిందంట. 

మాస్ హిస్టీరియా..

మాస్ హిస్టీరియా అనేది అసాధారణమైనది. వ్యక్తుల్లో కానీ సమూహంలో కానీ అసాధారణమైన ప్రవర్తనలు, ఆలోచనలు, భావాలు కనిపిస్తాయి. నిపుణులు ఎక్కువగా మాస్ హిస్టీరియాని ఒక రకమైన డిజార్డర్ లేదా మానసిక అనారోగ్య స్థితిగా పరిగణిస్తారు. ఇది భావోద్వేగ లేదా మానసిక ఒత్తిడి ద్వారా ప్రేరేపించబడిన శారీరక లక్షణాలను కలిగి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here