స్పందన ఫిర్యాదుల పట్ల ప్రత్యేక చొరవ తీసుకోని పరిష్కారించాలి

0
5
Spandana program

ప్రకాశం జిల్లా పోలీస్‌ స్పందనకు 97 పిర్యాదులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కొరకు ఈ రోజు ‘స్పందన’ కార్యక్రమంను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నిర్వహించారు. జిల్లాలో పలు ప్రాంతాల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారుల యొక్క వ్రాతపూర్వక అర్జీలను ఎస్పీ స్వయంగా స్వీకరించి వారితో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యల పూర్వాపరాలను అడిగి తెలుసుకొని, వాటిని చట్టపరిధిలో పరిష్కరిస్తామని ఫిర్యాదిదారులకు భరోసా కల్పించారు. ఎస్పీ గారు ఆయా ఫిర్యాదులపై సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఆ ఫిర్యాదులపై వెంటనే దర్యాప్తు చేపట్టి, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోని భాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.

ఈ రోజు స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని…

చీటి పాట పేరుతో తన వద్ద నుండి పొదిలి టౌన్ కు చెందిన జి. వెంకటనారాయణ అనే వ్యక్తి నెలకు 20 వేల రూపాయలు చొప్పున 3 లక్షల రూపాయలు డబ్బులు కట్టించుకొని చీటి పాట చివర్లో డబ్బులు అడుగుతుంటే ఇవ్వటం లేదని దొనకొండ మండలం, ఇళ్లచెరువు గ్రామము చెందిన యం.మురళీకృష్ణ పిర్యాదు.

కరోనా సమయంలో రిమ్స్ హాస్పిటల్ నందు కోవిడ్ సర్వేయర్ గా విధులు నిర్వహిస్తున్న తనకు పత్తి వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, పోలిరెడ్డి మరియు నాగేంద్రం అనేవాళ్లు సెక్రటేరియట్ ఉద్యోగులమని పరిచయం అయి, DTWOలో ANM మరియు అటెండర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, మనిషికి రెండు లక్షల 50 వేల రూపాయలు కడితే ఆ ఉద్యోగాలు నమ్మబలికి తనతో మరియు మరికొంతమందితో 12 లక్షల రూపాయల వరకు డబ్బులు కట్టించుకుని ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేసి, డబ్బులు అడుగుతుంటే ఇవ్వటం లేదని ఒంగోలు టౌన్ కు చెందిన ఆర్ మాధవి అనే మహిళా పిర్యాదు.

ఈ స్పందన కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(క్రైమ్) యస్.వి. శ్రీధర్ రావు, DSB DSP బి.మరియాదాసు , ఒంగోలు డిఎస్పీ యు. నాగరాజు , ICCR ఇన్స్పెక్టర్ కె.రాఘవేంద్ర , ప్యానల్ అడ్వకేట్ బీవీ శివరామకృష్ణ , స్పందన ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here