స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులతో సమీక్షా …శ్రీమతి మలిక గర్గ్ ఐపియస్

0
2

దర్యాప్తులో వేగాన్ని పెంచి పెండింగ్‌ కేసులను తగ్గించాలి: జిల్లా ఎస్పీ:

పోలీసులు మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో శాఖలు సంయుక్తంగా పనిచేస్తూ నాటుసారా తయారీని అరికట్టాలి: జిల్లా ఎస్పీ గారు**అక్రమ మద్యం, గంజాయి, గుట్కా రవాణాను అడ్డుకట్ట వెయ్యాలి: జిల్లా ఎస్పీ గారు* అక్రమంగా రవాణా అవుతున్న గంజాయి, గుట్కా, నాటు సారా, మద్యన్ని అడ్డుకట్టు వేయాలని ఎన్ఫోర్స్మెంట్ అధికారులును జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు నమోదు చేసిన కేసులపై ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులతో జిల్లా ఎస్పీ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు నాటు సారా తయారీ నిర్మూలనకు చేపట్టిన చర్యలను గురించి, ఎంత మందిపై పి.డి యాక్ట్ కేసులు, బౌండ్ ఓవర్ కేసులు నమోదు చేశారన్న విషయాల గురించి ఆరా తీసి పలు సూచనలు మరియు సలహాలు తెలియచేసారు. ఈ సమావేశంలో ఎస్పీ గారు మాట్లాడుతూ పెండింగు కేసులలో దర్యాప్తు వేగంగా పూర్తి చేసి ఛార్జ్ షీట్లు కోర్టులో దాఖలు చేయాలని, క్రమేపి నేరాలకు పాల్పడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించి వారిపై బైండోవరు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

నాటుసారా కేసులలో సమగ్రమైన విచారణ జరిపి నేరస్థులకు శిక్ష పడేలా కృషి చెయ్యాలని ఎస్పీ గారు సూచించారు.

.నాటుసారా తయారీ, ఉత్పత్తి మరియు విక్రయా కేంద్రాలుపై ప్రత్యేక దృష్టి సారించాలనిన్నారు. పోలీస్ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో శాఖలు కలిసి సంయుక్తంగా నిరంతర దాడులు నిర్వహించాలని, నాటు సారా రవాణా చేసే వివిధ మార్గాల గుర్తించి నిరంతర తనిఖీలు చేస్తూ గంజాయి, అక్రమ మద్యం మరియు నిషేధించబడిన పొగాకు ఉత్పత్తుల అక్రమ రవాణాలను అరికట్టాలని సూచించారు. గ్రామాలలో నాటుసారాపై సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని, నాటుసారా కాచుటకు అలవాటు పడిన నేరస్ధులలో పరివర్తన తెచ్చే విధంగా ప్రత్యేక కార్యాచరణను అమలు చేయాలని ఎస్పీ గారు అన్నారు. పరివర్తన- 2.0 ద్వారా నాటుసారా తయారీ ఉన్నగ్రామాలను నాటుసారా రహిత గ్రామాలుగా మార్చేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు మరియు స్థానిక పోలీసు అధికారులు కృషి చెయ్యాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ డైరెక్టర్ SEB శ్రీ యన్. సూర్యచంద్ర రావు గారు, SEB ES శ్రీ A.అవులయ్య గారు, DSB DSP బి.మరియదాసు, SEB అధికారులు శ్రీనివాసులు నాయుడు గారు, యం.సుధీర్ బాబు గారు, CI వంశీధర్, SEB సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here