స్వగ్రామంలో కృష్ణంరాజు సంస్కరణ సభ

0
6
Yuvi Krishnamraj's reformation assembly in his hometown

హాజరైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మంత్రులు, ప్రజాప్రతినిధులు

రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణంరాజు సంస్మరణ సభకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకు విచ్చేశారు . దాదాపు 12 ఏళ్ల తర్వాత స్వస్థలానికి విచ్చేసిన ప్రభాస్ ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణంరాజుకు మొగల్తూరులోని ఆయన నివాసంలో గురువారం కుటుంబ సభ్యులు సంస్మరణ సభ నిర్వహించారు.

రాష్ట్ర మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఆర్కే రోజా, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, మాజీ మంత్రులు కొత్తపల్లి సుబ్బారాయుడు, పీతల సుజాత, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, గ్రంధి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు తదితర ప్రముఖులు హాజరయ్యారు. రెబల్ స్టార్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సతీమణి శ్యామలా దేవి, సోదరుని కుమారుడు, సినీ హీరో ప్రభాస్, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here