స్వాతంత్ర్యం వచ్చి 75 యేళ్లు..

0
4

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 యేళ్లు కావస్తుంది

ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాలు, బలిదానాలు చేసి స్వాతంత్ర్యం తెచ్చారు

ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. దేశాభివృద్ధికి కష్టపడి పని చేశారు

స్వాతంత్ర్య దినోత్సవ వేడుక ను ఈయేడాది ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది

నాటి త్యాగ ధనుల గురించి నేటి తరం తెలుసుకునేలా కార్యక్రమాలు భారత ప్రభుత్వం చేపట్టింది

ప్రధాని అధ్యక్షతన ఆజాదికా అమృత్ మహోత్సవ్ కమిటీ ఏర్పాటు చేశారు

250 మంది ఉన్న ఈ కమిటీ లో రాజకీయాలకు అతీతంగా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు

సాంస్కృతిక, చైతన్య కార్యక్రమాలు చూసే బాధ్యత నాకు అప్పగించారు

అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వామ్యం చేస్తున్నాం

కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో భాగమై పని చేస్తున్నాయి

ఆగష్టు 15 2023 వరకు ఈ ఆజాది కా అమృత్ మహోత్సవం జరుగుతుంది

దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పధంలో నడిపిస్తున్నాం

ప్రపంచ వ్యాప్తంగా మన దేశానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది

2047కి స్వాతంత్ర్య సాధించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం

ఈ పాతికేళ్లు మన దేశానికి బంగారు ఘడియలు

రాజకీయాలకు అతీతంగా మన దేశాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవాలి

ఇందులో యువత కీలకపాత్ర పోషించాలని కోరుతున్నా

వచ్చే 25 సంవత్సరాల తరువాత యూత్ పాపులేషన్ మనకు తగ్గుతుంది

అందరం ఎజెండా పెట్టుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది

ప్రధాని, కమిటీ సభ్యులు కూడా ఈ అంశాలపై చర్చ చేసి కార్యాచరణ రూపొందిస్తారు

ఆగష్టు 2న పింగళి వెంకయ్య శత జయంతి జరుపుకుంటున్నాం

ఆయన స్వగ్రామం భట్లపెనుమర్రు వెళ్లి కుటుంబ సభ్యులు ను కలుస్తా

ఢిల్లి, కోల్ కత్తాలో జరిగే కార్యక్రమం లో అమిత్ షా పాల్గొంటారు

ఢిల్లోలో ఆయన ఫొటొ తో‌ పోస్టల్ స్టాంప్ ను విడుదల చేస్తాం

వెంకయ్య రూపొందించిన నిజమైన జెండాను ప్రదర్శిస్తాం

మువ్వన్నెల జెండా చూస్తే జాతీయత ఉప్పొంగుతుంది

ఆగష్టు13-15వరకు దేశంలో ప్రతి ఇంటి పైన మన జాతీయ జెండా రెపరెపలాడాలి

ప్రధాని కూడా అన్ని రాష్ట్రాల సిఎంలతో దీని పై మాట్లాడారు

హర్ ఘర్ తిరంగా.. ఘర్ ఘర్ తిరంగా పేరుతో కార్యక్రమం చేస్తున్నాం

పార్టీ లు, రాజకీయాలకు అతీతంగా ఇళ్ల పై జెండాను ఎగుర వేయాలి

భారతీయులు దేశ భక్తికి చిహ్నంగా అందరూ భాగం కావాలి

ఆగష్టు2నే పింగళి జయంతి సభ వేదిక మీద నుంచే ఒక పాట విడుదల చేస్తున్నాం

ప్రధాని, అమిత్ షా లు పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులు ను సన్మానిస్తారు

ఢిల్లీలో ఎయిర్ పోర్ట్ నుండి పార్లమెంటు విజయ చౌక్ వరకు ఆగష్టు3న యాత్ర చేపట్టాం

పార్లమెంటు సభ్యులు అంతా మోటార్ సైకిల్ పై తిరంగా యాత్ర లో పాల్గొంటారు

ఆగష్టు14న మన దేశాన్ని విభజించిన రోజు

గాంధీ ఆలోచన విధానానికి విరుద్ధంగా గా భారతదేశాన్ని చీల్చారు

పాకిస్తాన్, హిందూస్థాన్ గా విడగొట్టారు

మతం పేరుతో పది వేల మందిని ఆరోజు ఊచకోత కోసి చంపారు

ఆరోజు ను పాకిస్తాన్ విభజన్ కా‌ విదుష్ కా స్మృతి దివస్ పేరుతో కార్యక్రమం చేపడతాం

ఆరోజు చనిపోయిన వారికి శ్రద్దాంజలి ఘటించి గుర్తు చేసుకుంటాం

ఆరోజు పారిపోయి వచ్చిన వారిని సభకు తీసుకువస్తాం

ఆగష్టు14 రాత్రి అందరూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలి

యువకులు ఎక్కడికక్కడ మోటారు సైకిళ్ల యాత్ర ను నిర్వహించండి

ఆగష్టు 9 తరువాత ఎప్పుడు వీలైతే అప్పుడు ర్యాలీలు చేపట్టండి

మహనీయుల విగ్రహాలను శుభ్రం చేసి అలంకరించాలి

ఆగష్టు15న పూలమాలలు వేసి ఘనంగా‌ నివాళలు అర్పించాలి

ప్రతి భారతూయుడూ ఈ కార్యక్రమం లో భాగస్వామ్యం కావాలి

ఎవరికి వారు జెండాను కొనుక్కుని ఎగుర వేయాలి

అన్ని ఫోస్టాఫీసులలో జెండాలను అందుబాటులొ ఉంచుతాం

జెండాల తయారీ పై తయారీదార్లకు కూడ లేఖలు రాశాం

పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులు ను కలిసి ప్రధాని తరపున ఆహ్వానం అందిస్తాను

అన్ని ఖాదీ పరిశ్రమ లకు కూడా ఆర్డర్లు ఇచ్చాం

అయితే ఖాదీ ద్వారా అన్ని జెండాలు తయారీ సాధ్యం కాదు

వెంకయ్యకి భారతరత్న అంశం పై చర్చ జరగలేదు

దీని పై కూడా కమిటీ లో చర్చిస్తాం

అల్లూరి సీతారామరాజు వీర మరణం పొందిన స్థలం, నడయాడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం

35కోట్లతో లంబసింగిలో అల్లూరి సీతారామరాజు మ్యూజియం నిర్మాణం చేస్తున్నాం

అల్లూరి, ఘంటసాల, నన్నయ్య వంటి వారి గురించి ప్రధానికి వివరించా

వాళ్ల గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకునే విధంగా కేంద్రం ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here