హజ్ యాత్రికుల నాలుగో విమానం లో తిరిగిస్వదేశానికి చేరుకున్న హాజిలు

0
7

స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటి ఈ రోజు హజ్ యాత్రికుల నాల్గవ విమానం సురక్షితంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకోవడం జరిగింది. హజ్ యాత్ర నుండి వచ్చిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన 191 మందికి ఏపి హజ్ కమిటీ ఛైర్మన్ మరియు, కమిటీ సభ్యులు స్వాగతం పలికారు.ఇందుకు హజ్ యాత్రికులు చాలా సంతోషం వ్యక్తం చేసారు .అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరపున నియమించిన అధికారులు మరియు ఖాదీముల్ హుజ్జాజ్ వారి సేవలను కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 60,000/-మరియు 30,000/-తోఫా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా రాష్ట్ర హజ్ కమిటీ మునుపేన్నడు లేనివిధంగా సౌకర్యాలు కల్గిచినందుకు హజ్ కమిటీ చైర్మన్ Bs గౌసల్ ఆజమ్ గారికి మెంబెర్స్ కు హజ్ కమిటీ అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు .హజ్ కమిటీ చైర్మన్ జనాబ్ B S గౌసుల్ ఆజమ్ గారు మాట్లాడుతూ హజ్ 2022 విజయవంతం గా జరగటం లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందని తెలిపారు ,ముఖ్యంగా హజ్ వాలంటీర్స్ సేవలను కొనియాడారు.అలాగే యాత్ర పూర్తి చేసుకొని వచ్చిన 1164 మందికి ముఖ్యమంత్రి ys జగన్ ,మైనారిటీ శాఖ మంత్రి అంజాద్ బాషా శుభాకాంక్షలు తెలిపారు .హజ్ యత్రికులకు ఘనంగా స్వాగతం పలికిన హజ్ కమిటీ ,వారికి పవిత్ర జమ్ జమ్ నీరు అందించటం జరిగింది ఈ కార్యక్రమం లో 5 రోజుల నుండి హైదరాబాద్ లో ఉండి హజ్ యత్రికులకి అన్ని సౌకర్యాలు పర్యవేక్షించిన చైర్మన్ గౌసుల్ ఆజమ్ మరియు డైరెక్టర్లు ఇబదుల్ల, వలియుల్లా, మహబూబ్ బాషా, మునీర్,పుంగనూరు ఖాదర్ భాష, కర్నూల్ మంజుర్ అహ్మద్ మౌలానా అతఉల్లా మరియు తెలంగాణా హజ్ కమిటీ చైర్మన్ హజ్ యత్రి కుల ఖిద్మత్లో పాల్గొన్నారు.2022 కన్నా రాబోయే రోజుల్లో మరింత మెరుగుయిన సౌకర్యాలు అందిచ్చే విధoగా ప్రయత్నం చేస్తామని అదే విధంగా సీఎం జగన్ మెహన్ రెడ్డి గారి సహకారంతో వచ్చే సంవత్సరo విజయవాడ నుండి 2023 యాత్ర కు, హజ్ టార్మినల్ విజయవాడ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని ఎంబరిగేషన్ తప్పకుండా వచ్చే విధంగా చేస్తామని అన్నారు . అలాగె GMR ఎయిర్పోర్ట్ అధికారులకు, సిబ్బందికి, భద్రతా అధికారులకు చైర్మన్ గారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ యాత్ర నందు సతి సమేతంగా హజ్ కు వెళ్లి వచ్చిన హజ్ కమిటీ సభ్యులు మరియు హాజయాత్ర విజయవంతంగ పుర్తి చేసుకుని తిరిగిస్వదేశానికి వచ్చింది mlc ఇషాక్ గారికి కూడా స్వాగతం పలకటం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here