హర్యానా ఘటనపై కేంద్రం క్లారిటీ..

0
6

జాతీయ జెండా కొనుగోలు నిర్భందం కాదు.. 

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఈఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసింది. హర్ ఘర్ తిరంగా పేరుతో ఈనెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈక్రమంలో ప్రజలకు తక్కువ ధరకే జాతీయ జెండా అందించాలనే ఉద్దేశంతో పోస్టాఫీసులు, రేషన్ దుకాణాల ద్వారా రూ.20కే త్రివర్ణ పతకాన్ని అందుబాటులో ఉంచింది. అయితే ఇటీవల హర్యానాలోని ఒక రేషన్ దుకాణంలో రూ.20 చెల్లించి జెండా తీసుకుంటేనే రేషన్ ఇస్తామని.. లేదంటే ఇవ్వబోమని చెప్పడంతో వివాదం రేగింది.

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీతో పాటు, ప్రతిపక్షాలు ఈవిషయంపై స్పందిస్తూ ఇటువంటి నిర్భంధాలు సరికాదని కామెంట్ చేశాయి. మరోవైపు ప్రభుత్వ ఆదేశాలతోనే తాను జాతీయజెండాను తప్పనిసరిగా కొనుగోలు చేయాలని చెప్పినట్లు రేషన్ డీలర్ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేంద్రప్రభుత్వం స్పందించింది. జాతీయ జెండాలు తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులో ఉంచామని.. అయితే వాటిని కొనుగోలు చేయాలనే నిర్భందం ఏమి లేదని పిఐబి ఫ్యాక్ట్ చెక్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. జాతీయ జెండాను కొనుగోలుచేయకపోతే రేషన్ ఇవ్వబోమంటూ సామాజిక మాద్యమాల్లో ప్రసారమవుతున్న పోస్టులో వాస్తవం లేదని.. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని పిఐబి ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. కేంద్రప్రభుత్వం నుంచి అటువంటి ఆదేశాలు ఏమి లేవని స్పష్టం చేసింది. కేంద్రప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. తప్పుడు సమాచారంతో ప్రజలను పక్కదోవ పట్టించేలా వ్యవహరించిన హర్యణాలోని రేషన్ డీలర్ కు సంబంధించిన డిపో అనుమతులను రద్దు చేసినట్లు తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here