హర్‌ ఘర్‌ తిరంగా క్యాంపెయిన్‌లో మంత్రి హరీశ్‌రావు..

0
5

 స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అజాదీ కా అమృత్ మహోత్సవ్‌ పేరుతో కేంద్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. హర్‌ఘర్‌ తిరంగా క్యాంపెయిన్‌లో అందరూ భాగస్వాములని కోరిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలో ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. మంత్రే స్వయంగా ఇంటింటికీ తిరిగి జెండా విశిష్టతను, ప్రాముఖ్యతను వివరించారు. ఆగస్టు 15న మువ్వన్నల జెండాను ఇంటిపై ఎగరేయాలని కోరారు. ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

అంతకు ముందు పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్మెన్ రోజా రమణి శర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, తెలంగాణ ఫారెస్ట్ డెవలప్ మెంట్ చైర్మెన్ ఒంటేరు ప్రతాప రెడ్డి, గ్రామ సర్పంచ్, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here