హాస్టళ్ల విద్యార్థుల కోసం సీఎం జగన్ ఆదేశాలు..

0
2
There should be no role of millers in grain purchases..CM Jagan

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. మంత్రులు మేరుగ నాగార్జున, వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో వసతులపై సీఎం సర్వే చేశారని.. హాస్టళ్లలో పిల్లలకు పౌష్టికాహారం అందే విషయంపైనా సీఎం జగన్ సమీక్షించారన్నారు. అన్ని హాస్టళ్లలో మరుగుదొడ్ల నిర్వహణ కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచేందుకు సిబ్బందిని నియమించాలని.. పిల్లలకు ఇచ్చే ఆహారం మెనూను మెరుగుపరచాలని సూచించారన్నారు.

ఇంటి కంటే హాస్టళ్లలో భోజనం, సదుపాయాలు, విద్య బాగుండాలని కొన్ని సూచనలు చేశారని.. హాస్టల్ విద్యను రూపు మార్చాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. దయనీయ స్థితిలో ఉన్న హస్టళ్ల భవనాలను మార్చాలన్నారు. మూడువేల హాస్టళ్లలో అవసరమైన మరమ్మతులు వెంటనే చేయడంతో పాటూ హాస్టళ్లలో వెంటనే మరమ్మతులు చేపట్టేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలి అన్నారు సీఎం. నాడు నేడు కింద ఏడాదిలో మరమ్మతులు చేయడం సహా నూతన భవనాలు నిర్మించాలని సీఎం ఆదేశించారన్నారు.

 ఇక, హాస్టళ్లలో తప్పనిసరిగా వైద్యుల సందర్శన ఉండాలని ఆదేశించారు.. హాస్టళ్ల నిర్వహణా ఖర్చులు, డైట్‌ ఛార్జీలను పెంచాలని.. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తయారుచేయాలన్నారు. ‘మన పిల్లలను ఏదైనా స్కూలుకు పంపిస్తున్నప్పుడు మనం ఎలా ఆలోచిస్తామో.. ప్రభుత్వం రెసిడెన్షియల్‌ స్కూళ్లు, పాఠశాలలు, హాస్టళ్లుకూడా అలాగే ఉన్నాయో లేదో ఆలోచన చేయాలి’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here