హెల్త్ ఏటిఎంలు ఏర్పాటు

0
5

టెక్నాలజీ రోజురోజుకూ కొత్త కొత్తగా రూపాంతరం చెందుతోంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ సర్కార్ అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. తాజాగా మథుర జిల్లా ఆసుపత్రిలో హెల్త్ ఏటీఏం సేవలు మొదలయ్యాయి. ఆరోగ్య పరీక్షలు చేసే యంత్రం ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే 23 వ్యాధులకు వైద్య పరీక్షలను ఈ ఏటిఎం ద్వారా చేయొచ్చు. ఈ హెల్త్ ఏటిఎం యంత్రం ద్వారా ఓ వ్యక్తిలోని రోగాలను నిర్ధారించడమే కాకుండా రోగులకు తక్షణ చికిత్సకు మార్గం సుగమం చేస్తుందని మథుర ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ముకుంద్ బన్సాల్ వెల్లడించారు. హెల్త్ టెస్టులు విడివిడిగా చేస్తే చాలా సమయం అవుతుందని, అదే 23 రకాల పరీక్షలను ఒకే యంత్రం ద్వారా చేేస్తే సమయం ఆదా అవుతుందని వైద్యులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here