హైదరాబాద్‌లో ఉత్సాహంగా 5కె రన్..

0
6

 డీజే టిల్లు పాటకి డ్యాన్స్ చేసిన మంత్రులు, సీవీ ఆనంద్

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌ పోలీసులు నిర్వహించిన 5కె రన్ ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా డీజే టిల్లు పాటకి మంత్రులు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో 5K రన్‌ని ఘనంగా నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ సెంటర్‌ నుంచి ఈ రన్ మొదలైంది. ప్రారంభ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డీజీపీ మహేందర్‌ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సీఎస్ సోమేష్‌కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజే టిల్లు సినిమా పాటకు మంత్రులు, పోలీసులు ఉత్సాహంగా డ్యాన్సులు చేయడం ఆకట్టుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here