హైదరాబాద్ నగరంలో సంచలనం..

0
9

మాదాపూర్‌లో జరిగిన కాల్పుల భూ వివాదంతోనే ఇస్మాయిల్‌పై కాల్పులు..పరారీలో నిందితులు

హైదరాబాద్ నగరంలో సంచలనం రేపిన మాదాపూర్ కాల్పుల కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. తాడ్‌బండ్‌లోని 250 గజాల స్థలం విషయంలో ఇస్మాయిల్, మహమ్మద్ ముజాయుద్దీన్ మధ్య వివాదం కొనసాగుతోంది. ఇస్మాయిల్, ముజాహిద్దీన్ పాత నేరస్తులు. ఇస్మాయిల్ కొన్నాళ్ల క్రితమే మహమ్మద్ ముజాహిద్దీన్ పేరుమీద గిఫ్ట్ డిడ్ చేశాడు. ఈ భూమి విషయంలో కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ స్థలం వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ముజాహిద్దీన్‌ని మాదాపూర్ రావాలని ఇస్మాయిల్ ఆహ్వానించాడు. ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో ముజాహిద్దీన్‌కి అనుచరుడైన జిలానీ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ క్రమంలోనే ముజాహిద్దీన్ కంట్రీ మేడ్ గన్‌తో ఇస్మాయిల్‌పై ఆరు రౌండ్ల కాల్పులు జరిపాడు.

ఈ ఘటనపై బాలానగర్ డీసీపీ సందీప్‌రావు మాట్లాడుతూ.. మాదాపూర్ పీఎస్ పరిధిలోని నీరుస్ జంక్షన్ వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇస్మాయిల్‌పై జిలానీ వ్యక్తి కాల్పులు జరిపాడని తెలిపారు. ఇస్మాయిల్‌, ముజాహిద్దీన్ మధ్య భూవివాదం కొనసాగుతోందని, దీనిపై ఇద్దరూ మాట్లాడుతుండగా ముజాహిద్దీన్ అనుచరుడైన జిలానీ కాల్పులకు తెగబడ్డాడని వెల్లడించారు. ఆదివారం సాయంత్రం కలుసుకున్న ఇస్మాయిల్, ముజాహిద్దీన్.. మాసబ్‌ ట్యాంక్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌లో పలు దఫాలుగా చర్చలు జరిపి చివరికి మాదాపూర్ చేరుకున్నారని డీసీపీ తెలిపారు. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఇద్దరి మధ్య చర్యల మొదలు కాగా.. తెల్లవారుజామున 4గంటల సమయంలో జిలానీ కాల్పులకు తెగబడ్డాడని వెల్లడించారు.

ఇస్మాయిల్‌పై కాల్పులు జరిపింది జిలానీ, మహ్మద్‌ పోలీసులు గుర్తించారు. పాతకక్షలతోనే ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇస్మాయిల్‌పై ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. భూ వివాదం కారణంగానే కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. మాదాపూర్‌లో కాల్పులు జరగ్గా.. డెడ్‌బాడీని తీసుకెళ్లి జూబ్లీహిల్స్ నీరూస్ దగ్గర దగ్గర వదిలివెళ్లారు. ఈ కాల్పుల వ్యవహారంలో ఓ వ్యక్తి ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఓ భూ వివాదంపై చర్చించేందుకు అక్కడికి వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here