హైదరాబాద్‌ యువతికి చేదు అనుభవం.ఫిలిప్పీన్స్‌ నుంచే వెనక్కి

0
4
hyderabad girls problems faced at phillipins

కరోనా కారణంగా మధ్యలో నిలిచిపోయిన వైద్య విద్యను పూర్తి చేసేందుకు ఫిలిప్పీన్స్‌ వెళ్లిన ఓ తెలుగు విద్యార్థినికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె పేరు బ్లాక్‌లిస్ట్‌లో ఉందనే కారణంతో ఇమ్మిగ్రేషన్ సిబ్బంది ఎయిర్‌పోర్టులోనే నిలిపివేసి తిరిగి భారత్‌కి పంపేశారు. హైదరాబాద్‌ శివారు వనస్థలిపురానికి చెందిన ఎనుగుల నవ్య దీప్తి అనే యువతి ఫిలిప్పీన్స్‌లో మూడేళ్లుగా వైద్యవిద్య అభ్యసిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో హైదరాబాద్‌ తిరిగి వచ్చేసిన ఆమె ఆన్‌లైన్‌లో కోర్సు కంటిన్యూ చేశారు. అయితే ఎంబీబీఎస్ ఆఖరి సంవత్సరం ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కావడంతో బుధవారం ఫిలిప్పీన్స్‌కు బయలుదేరి వెళ్లారు.మనీలా విమానాశ్రయంలో దిగి బయటికి వెళ్లే క్రమంలో ఇమ్మిగ్రేషన్ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. దీప్తి పేరు బ్లాక్‌లిస్టులో ఉందని చెప్పి చాలాసేపు నిలిపివేశారు. తనను ఎందుకు ఆపేశారని దీప్తి అధికారులను ప్రశ్నించగా.. ఫిలిప్పీన్స్‌లో గతంలో ఆమె నివసించిన ఇంటి యజమానురాలు ఫిర్యాదు చేశారని, అందువల్లే బ్లాక్‌లిస్టులో చేర్చామని తెలిపారు. దీంతో మనీలాలోని ఇండియన్ ఎంబసీని సంప్రదించేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. చేసేదేమిలేక ఆమె తిరిగి హైదరాబాద్‌ వచ్చేశారు.అక్కడ తనకు జరిగిన అనుభవాన్ని దీప్తి వీడియోలో వివరించారు. హైదరాబాద్‌ వచ్చేశాక అద్దె డబ్బులివ్వాలని ఇంటి యజమానురాలు అడిగిందని, అద్దె డబ్బులు పోను మరో రూ.40 వేలు ఇవ్వకుంటే కేసు పెడతానని హెచ్చరించడంతో ఆ డబ్బు ముట్టజెప్పానని తెలిపారు. తన ఇంటి యజమానురాలు పాస్‌పోర్టు కార్యాలయంలో పనిచేస్తున్నందున పరపతి ఉపయోగించి తన పాస్‌పోర్టు బ్లాక్ చేయించారని ఆరోపిస్తోంది. అడిగినంత డబ్బులు ఇచ్చినా కూాడా తనపై ఫిర్యాదు చేసి బ్లాక్ లిస్టులో చేర్చడం దారుణమని దీప్తి ఆవేదన వ్యక్తం చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here