హ్యాపీ బర్త్ డే అవర్ సూపర్ స్టార్.. మహేశ్ ‌బాబు

0
6

 హ్యాపీ బర్త్ డే అవర్ సూపర్ స్టార్.. 

సూపర్ స్టార్  .  ఆ పేరులో ఓ వైబ్రేషన్ ఉంది.. ఆ పేరు లో ఓ స్టైల్ ఉంది.. ఆ పేరులో ఓ మత్తుంది.. ఇది మహేష్ ఫ్యాన్స్ చెప్పే డైలాగ్స్.. నిజంగానే మహేష్ అంటే దేశవ్యాప్తంగా అంత క్రేజ్ ఉంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ పేరులో ఓ వైబ్రేషన్ ఉంది.. ఆ పేరులో ఓ స్టైల్ ఉంది.. ఆ పేరులో ఓ మత్తుంది.. ఇది మహేష్ ఫ్యాన్స్ చెప్పే డైలాగ్స్.. నిజంగానే మహేష్ అంటే దేశవ్యాప్తంగా అంత క్రేజ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో ఎక్కడి లేని ఉత్సాహం.. సూపర్ స్టార్ గా అంతులేని ప్రేక్షాదరణ సంపాదించుకొని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు మహేష్. ఇక మహేష్ కటౌట్ కి, అందానికి ఫిదా కానీ అమ్మాయిలు ఉండరు. చూడటానికి టీనేజ్ కుర్రాడిలా కనిపిస్తూ లేడీ ఫ్యాన్స్ హృదయాల్లో నిండిపోయాడు ఈ ‘రాజకుమారుడు’. తండ్రిబాటలోనే నడుస్తూ.. ‘యువరాజుగా’ టాలీవుడ్ ను ఏలుతున్నాడు మహేష్. సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా చరిత్రలో సృష్టించిన రికార్డుల గురించి అందరికి తెలిసిందే.. ఇప్పుడు ఆ రికార్డులను తిరగరాయడం ఈ ”ఒక్కడు” మాత్రమే చేయగలడు అని నిరూపిస్తున్నారు. ”అతడు” స్క్రీన్ పైన కనిపిస్తే చాలు ఫ్యాన్స్ కు పూనకాలే.. మాస్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించే ”పోకిరి” ఆయన.. మహేష్ ”దూకుడు” చూసి బాక్సాఫీస్ నోరెళ్లబెట్టాల్సిందే..

ఇప్పటికే మహేష్ ‘ఖలేజా’ ఏంటో దేశవ్యాప్తంగా తెలిసిపోయింది.. సినిమాలతోనే కాదు మంచి మనసున్న శ్రీమంతుడు మా మహేష్ అంటూ ఫ్యాన్స్ ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు ఫ్యాన్స్. పాన్ ఇండియా సినిమాలతో సంబంధం లేకుండా దేశ వ్యాప్తంగా ”సరిలేరు నీకెవ్వరు” అనిపించుకుంటున్నారు మహేష్.  1000 మందికి పైగా చిన్నారుల గుండెలను కాపాడిన దేవుడు మహేష్ అంటూ కీర్తిస్తున్నారు ఫ్యాన్స్. ఇదే కాదు మరెన్నో ఎన్నో గుప్తా దానాలను మహెష్ చేస్తుంటారు. కానీ అవేమి చెప్పుకోవడానికి, పబ్లిసిటీ చేసుకోవడానికి మహేష్ ఇష్టపడరు. ఇక మహేష్ బాబు పుట్టిన రోజు వచ్చిందంటే మాములుగా ఉంటుందా.. ఆ రోజు పెద్ద పండగే. రాష్ట్రాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటరు అభిమానులు. నేడు మహేష్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమానులు హంగామా చేస్తున్నారు. నిన్నటి నుంచే మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్ట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం హ్యాపీ బర్త్ డే మహేష్ బాబు ట్యాగ్ ట్రేండింగ్ లో ఉంది. ఇక ఇతర హీరోల అభిమానులు సైతం తమ హీరోల ఫోటోలను మహేష్ ఫొటోతో కలిపి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ రోజు మహేష్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here