10వ తరగతి పరీక్షా ఫలితాలు…

0
4

త్వరలో ఏపీ 10వ తరగతి సప్లిమెంటరీ, బెటర్‌మెంట్‌ ఫలితాలు.. లింక్‌ ఇదే

త్వరలో ఆంధ్రప్రదేశ్‌ 10వ తరగతి సప్లిమెంటరీ, బెటర్‌మెంట్‌ పరీక్షా ఫలితాలు విడుదలకానున్నాయి. ఈ ఏడాది ఈ పరీక్షలకు 2,01,627 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఏపీలో 10వ తరగతి సప్లిమెంటరీ, బెటర్‌ మెంట్‌ పరీక్షా ఫలితాలు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం.. ఆగస్టు మొదటి వారంలో సప్లిమెంటరీ, బెటర్‌మెంట్‌ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ అంశంపై అధికారికంగా స్పష్టత రానుంది. ఈ ఏడాది ఈ పరీక్షలకు 2,01,627 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు

AP SSC సప్లిమెంటరీ ఫలితాలు వెలువడిన అనంతరం https://bse.ap.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు.

పదోతరగతి విద్యార్థులకు ఈసారి బెటర్‌ మెంట్‌ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా పదో తరగతి విద్యార్థులకు బెటర్‌మెంట్‌ పరీక్షను రాసే అవకాశం కల్పించారు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి తక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల కోసం ఈ అవకాశాన్ని కల్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here