10 గంటలపాటు ఆగిపోయిన రైళ్లు..!

0
8

బ్రహ్మపుత్ర మెయిల్ ట్రైన్ ఓ ఎద్దును ఢీకొంది. దాంతో ఢిల్లీ హౌరా రైలు మార్గంలో ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంట్ విరిగిపోయింది. దాంతో ఆ దారిలో సుమారు పది గంటలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే బృందం మరమ్మతులు నిర్వహించాక ట్రైన్స్ స్టార్ట్ అయ్యాయి.

ఓ ఎద్దు వల్ల కొన్ని గంటలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. 15658 బ్రహ్మపుత్ర మెయిల్ ఎద్దును ఢీకొంది. ఈ కారణంగా ఢిల్లీ హౌరా రైలు మార్గంలో ఓవర్‌హెడ్ ఎక్విప్‌మెంట్ విరిగిపోయింది. దాంతో ఆ మార్గంలో సుమారు 10 గంటల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని సీనియర్ రైల్వే అధికారి శనివారం తెలిపారు.

డిబ్రూగఢ్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా రైలు భర్వారీ రైల్వే స్టేషన్ సమీపంలో ఎద్దును ఢీకొట్టింది. శుక్రవారం రాత్రి 8.50 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. భర్వారీ రైల్వే స్టేషన్‌కు సుమారు రెండు కిలోమీటర్ల ముందు ఇది జరిగింది. ఆ తర్వాత ఇంజన్ డ్రైవర్ రైలును స్టేషన్‌లోని రెండో నెంబర్ ఫ్లాట్‌ఫామ్‌కు తీసుకెళ్లాడు. ఈ ఘటనతో లిచ్ఛవి ఎక్స్‌ప్రెస్, మహాబోధి ఎక్స్‌ప్రెస్, పురుషోత్తం ఎక్స్‌ప్రెస్‌తో సహా అనేక ప్రధాన రైళ్లను ముందు స్టేషన్‌లలో నిలిపివేశారు.

రైల్వే బృందం మిగతా అన్ని రైళ్లను నిలిపివేసి లైన్‌ను మరమ్మతులు నిర్వహించింది. ప్రయాగ్‌రాజ్ నుంచి పవర్ వ్యాగన్‌తో అక్కడికి చేరుకున్న రైల్వే ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ బృందం ఈ లైన్‌ను మరమ్మతులు నిర్వహించింది. బ్రహ్మపుత్ర మెయిల్ ఇంజన్‌లో కూడా సాంకేతిక లోపం ఏర్పడిందని, అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని భర్వారీ స్టేషన్ సూపరింటెండెంట్ డీఎన్ యాదవ్ తెలిపారు. మరమ్మతులు నిర్వహించాక ఈ ఉదయం 10 గంటల తర్వాత రైలు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here