10 నుండి శ్రీగిరి పవిత్రోత్సవాలు..

0
3

ఒంగోలులోని కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ పీఠపాలిత శ్రీగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి ఆశీస్సులతో పవిత్రోత్సవాలను ఈ నెల 10 వ తేదీ బుధవారం నుంచి 12వ తేదీ శుక్రవారం వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త , టీటీడీ ధార్మిక సలహా మండలి జిల్లా పూర్వ ఆధ్యక్షులు ఆలూరు
వేంకట రమణారావు , ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరు జ్వాలా రామారావు , కార్య నిర్వహణ ధర్మకర్త సీవీ రామకృష్ణారావు వెల్లడించారు.
పరాంకుశం సీతారామాచార్యులు బృందం ఆధ్వర్యంలో వైఖానస ఆగమోక్తానుసారం పవిత్రోత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు.
పవిత్రోత్సవాలలో భాగంగా
10 వ తేదీ బుధవారం ఉదయం శ్రీవారికి సహస్ర నామార్చన, పంచాంగ పఠనం నిర్వహిస్తారు.
సాయంత్రం 5:30 నుండి విష్వక్సేన ఆరాధన , పుణ్యాహవాచనం, మేదినీ పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ, చతుర్వేద పారాయణ, పంచ గవ్యారాధన , ఆకల్మష హోమం ,రక్షాబంధనం కార్యక్రమాలు జరుగుతాయి.
11వ తేదీ గురువారం ఉదయం 6 గంటలకు శ్రీవారికి సహస్ర నామార్చన,
8 గంటలనుండి కుంభారాధన, పవిత్ర ఆరాధన , నిత్య హోమం, 9 గంటలకు శ్రీవారికి విశేష స్నపన తిరుమంజనం, పవిత్రాల సమర్పణ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
సాయంత్రం 6.30 లకు పంచసూక్త హోమం, పారమాత్మిక హోమం, అష్టాశీతి హోమం ,
రాత్రి 9 గంటలకు శ్రీవారి ఏకాంత సేవ కార్యక్రమాలు జరుగుతాయి.
12 వ తేదీ శుక్రవారం ఉదయం శ్రీవారికి శుక్రవార అభిషేకం, సహస్ర నామార్చన,
8 గంటలనుండి విష్వక్సేన ఆరాధన , కుంభారాధన , సుదర్శనారాధన , సర్వ దైవత్వ హోమం , సహస్రశీతి మంత్ర హోమం,
10 గంటలకు విశేష స్నపన తిరుమంజనం, పంచామృత ప్రసాద వినియోగం జరుగుతాయి.
సాయంత్రం 5.30 గంటల నుండి కుంభ నివేదనం,
సర్వ దైవత్వ హోమం, ప్రాయశ్చిత్త హోమం,
ఉక్త హోమం , పూర్ణాహుతి ,రక్షాబంధన విసర్జన ,ఆచార్య శేష వస్త్ర బహుమానం, బ్రహ్మ ఘోష, యజమాన ఆశీర్వచనం కార్యక్రమాలతో మూడు రోజుల పవిత్రోత్సవాలు ముగుస్తాయి.
శ్రీగిరి పవిత్రోత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here