11 మంది టెర్రరిస్టుల అరెస్ట్..

0
2

మదర్సా ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడంతో పాటు అల్ ఖైదా, బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో అసోంలో 11 మంది టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు. మోరిగావ్‌కు చెందిన ముస్తఫా కీలక నిందితుడిగా పోలీసులు చెబుతున్నారు. ఇతనికి ముఖ్యంగా బంగ్లాదేశ్ అన్సరుల్లా టీమ్‌తో సంబంధాలు ఉన్నాయని.. అసోంలోని మోరిగావ్, బార్‌పేట జిల్లాల నుంచి ఒకేసారి అల్ ఖైదా, అన్సరుల్లా బంగ్లా టీంతో సంబంధాలున్న వాళ్లని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వివరించారు.

  • అసోంలో 11 మంది ఉగ్రవాదుల అరెస్ట్
  • మోరిగావ్‌లోని మదర్సా టీచరే కీలక నిందితుడు
  • ఉగ్రవాదుల నుంచి మరింత సమాచారం రాబట్టే పనిలో ఎన్ఐఏ

మదర్సా ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడంతో పాటు అల్ ఖైదా, బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో అసోంలో 11 మంది టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు. మోరిగావ్‌కు చెందిన ముస్తఫా కీలక నిందితుడిగా పోలీసులు చెబుతున్నారు. ఇతనికి ముఖ్యంగా బంగ్లాదేశ్ అన్సరుల్లా టీమ్‌తో సంబంధాలు ఉన్నాయని.. మదర్సా ముసుగులో టెర్రరిస్ట్ సంస్థలకు నిధులు చేరవేస్తున్నాడని పోలీసులు వివరించారు.

అసోంలోని మోరిగావ్, బార్‌పేట జిల్లాల నుంచి ఒకేసారి అల్ ఖైదా, అన్సరుల్లా బంగ్లా టీంతో సంబంధాలున్న వాళ్లని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. ” మేము అసోంలోని బార్‌పేట, మోరిగావ్ జిల్లాల్లో రెండు జిహాదీ మాడ్యూల్స్‌ను పట్టుకున్నాము. వీళ్లతో సంబంధాలున్న వారినీ అదుపులోకి తీసుకున్నాము. దేశంలో ఎక్కడెక్కడ టెర్రరిస్ట్ అటాక్‌లు ప్లాన్ చేశారనే సమాచారం వీళ్ల నుంచి తెలుసుకునే పనిలో ఎన్ఐఏ ఉంది” అంటూ మీడియాకు వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here