17 ఏళ్లు నిండిన యువత కు ఓటర్ కార్డు..

0
3
ఈసీ కీలక నిర్ణయం- 17 ఏళ్లకే ఓటర్ కార్డు దరఖాస్తుకు ఛాన్స్!

 కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 17 ఏళ్లు నిండిన యువత ఓటర్‌ కార్డు కోసం ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. దీంతో 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిన అవసరం లేకుండా ముందే ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఇక నుంచి17 ఏళ్ల వయసు దాటిన వారు ఓటర్‌ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 18 ఏళ్లు నిండిన తర్వాతనే ఓటర్‌ కార్డు అందిస్తారు. ఈ మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్‌ కుమార్‌, ఎలక్షన్‌ కమిషనర్‌ అనుప్‌ చంద్ర పాండేల నేతృత్వంలోని ఈసీఐ అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

17 ఏళ్లుపైబడిన యువత ఓటర్‌ జాబితాలో పేరు నమోదుకు ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించింది. ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపింది.

యువత కేవలం జనవరిలోనే కాకుండా ఏప్రిల్‌ 1, జులై 1, అక్టోబర్‌ 1వ తేదీల్లో ఓటర్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఈసీ. ప్రతి త్రైమాసికానికి ఓటర్‌ జాబితాను అప్డేట్‌ చేస్తారు. దీంతో ఆ మధ్య 18 ఏళ్లు నిండిన వారికి ఓటర్‌ కార్డు జారీ చేశారు.

ఇంతకుముందు ఓటర్‌ జాబితాలో పేరు నమోదు చేసుకుని గుర్తింపు కార్డు పొందేందుకు ఎవరైనా 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిందే. జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టిన వారు మాత్రమే ఓటర్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఇప్పుడు ముందస్తుగానే చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here