ఎస్‌యూవీ మార్కెట్‌లోకి..2023 ఆడి క్యూ3 బుకింగ్స్ మొదలయ్యాయి

0
12

Audi Q3 Bookings రూ.2 లక్షలు పే చేస్తే ఆడి క్యూ-3 బుక్ చేసుకోవచ్చు:

  •  ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా.. ఎస్‌యూవీ మార్కెట్‌లోకి విడుదల చేసిన 2023 ఆడి క్యూ3 బుకింగ్స్ మొదలయ్యాయి.
  • ఆసక్తిగల కస్టమర్లు.. www.audi.in వెబ్‌సైట్ ద్వారా గానీ, `మై ఆడి కనెక్ట్ అప్లికేషన్స్ ద్వారా రూ.2 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అయితే ముందుగా కార్లు బుక్ చేసుకున్న తొలి 500 మందికి బంపర్ ఆఫర్లు అందిస్తున్నది. వారంటీ పొడిగించడంతోపాటు కంప్రహెన్సివ్ సర్వీస్ ప్యాకేజీ కల్పిస్తున్నది. దీని ప్రకారం 2+3 3 ఏండ్ల వారంటీ, మూడేండ్లు లేదా 50 వేల కి.మీ. ప్రయాణం వరకు సర్వీసింగ్ ప్యాకేజీతోపాటు ఇప్పటికే ఆడి కస్టమర్లుగా ఉన్నవారికి స్పెషల్ లాయాల్టీ బెనిఫిట్లు ఉంటాయి. 2022 చివరికల్లా ఆడీ క్యూ-3 కార్ల డెలివరీ మొదలవుతుందని భావిస్తున్నారు.
  • భారత్ మార్కెట్‌లోకి ఆడి ఇండియా.. రెండు వేరియంట్లలో “ఆడీ క్యూ-3” తీసుకొస్తున్నది. ప్రీమియం ప్లస్‌, టెక్నాలజీ వేరియంట్లలో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్ల శ్రేణితో వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నది. పార్కింగ్ ఎయిడ్ ప్లస్ రియర్ వ్యూ కెమెరా, స్పీడ్ లిమిట్‌తో కూడిన క్రూయిజ్ కంట్రోల్ సిస్టం, ఎక్స్‌టీరియర్ మిర్రర్స్‌, పవర్ అడ్జస్టబుల్‌, హీటెడ్‌, పవర్ ఫోల్డింగ్‌, డిజిట్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, బ్లూటూత్ ఇంటర్ ఫేస్‌, 6-స్పీకర్ ఆడియో సిస్టమ్ తదితర ఫీచర్లు జత కలిశాయి. ఎంఎంఐ టచ్‌, ఎంఎంఐ నేవీగేషన్ ప్లస్‌తోపాటు వర్చువల్ కాక్‌పిట్ ప్లస్‌, వైర్‌లైస్ చార్జింగ్ ఫోన్‌బాక్స్‌, ఫోర్‌వే లంబార్ సపోర్ట్‌, 30 కలర్స్‌లో ఆంబియెంట్ లైటింగ్ ప్యాకేజీ, 10 స్పీకర్లతో సౌండ్ సిస్టమ్ కూడా ఉంటాయి.
  • కేవలం 7.3 సెకన్లలో 100 కి.మీ. స్పీడ్ అందుకోగల సామర్థ్యం గల ఆడి క్యూ-3 కారు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టీఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజిన్‌, 190 పీఎస్‌తోపాటు 320 ఎన్ఎం పీక్ టార్చి ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. ప్రీమియం ప్లస్ వేరియంట్‌లో 18 అంగుళాల 5 ఆర్మ్ స్టైల్ అల్లాయ్ వీల్స్‌, ఎల్ఈడీ రియర్ కాంబినేషన్ ల్యాంప్స్‌తో కూడి ఎల్ఈడీ హెడ్ ల్యాంప్‌లు, పనోరమిక్ గ్లాస్ సన్‌రూఫ్‌, హైగ్లాస్ స్టైలింగ్ ప్యాకేజీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
  • వచ్చే నెలాఖరు నాటికి ఆడి క్యూ-3 కారు ధర ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది మార్కెట్‌లోకి ఎంటరైనప్పటి నుంచి ఎస్‌యూవీ క్యాటగిరీలో బీఎండబ్ల్యూ ఎక్స్‌1, మెర్సిడెజ్ బెంజ్ గ్లా, వోల్వో ఎక్స్‌సీ40 కార్లతో పోటీ పడనున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here