క్యాంపస్‌ హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య

0
9

కళాశాల క్యాంపస్‌ హాస్టల్లో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్ పరిధి మైసమ్మ గూడలో ఉన్న మల్లారెడ్డి కళాశాలలో నిజామాబాద్‌కు చెందిన విద్యార్థిని శ్రావణి సీఎస్సీ మూడవ సంవత్సరం చదువుతుంది. మధ్యాహ్న సమయంలో శ్రావణి హాస్టల్ రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించి మృతదేహాన్ని గాంధీకి తరలించారు. అయితే శ్రావణి ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.

ఏబీవీపీ ఆందోళన..

కళాశాల ఆవరణలో ఉన్న హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకున్న శ్రావణి మృతదేహాన్ని ఆగమేఘాల మీద తరలించడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆత్మహత్య కారణాలను విశ్లేషించకుండా ఏ విధంగా మృతదేహాన్ని తరలిస్తారు అంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. ఆత్మహత్య సంఘటన వెలుగులోకి రావడంతోనే కళాశాలకి సెలవు ప్రకటించి సమీపంలోకి విద్యార్థులు ఎవరిని వెళ్లకుండా చేయడమే కాకుండా, తోటి విద్యార్థులు ఎవరిని స్పందించనీయకుండా కళాశాల యాజమాన్యం విద్యార్థులను భయభ్రాంతులను గురిచేస్తుందని ఆరోపించారు. ఈ విషయంపై నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధితులను శిక్షించాలని ఏబీవీపీ మేడ్చల్ విభాగ్ కన్వీనర్ శ్రీనాథ్ డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here