5వ రాష్ట్ర ఆర్థిక కమిషన్ ను వెంటనే నియమించాలి!

0
5
Y.V.B.RAJENDRA-PRASAD

4 వ రాష్ట్ర ఆర్థిక కమిషన్ రిపోర్ట్ ను వెంటనే ఆమోదించి అమలు చేయాలి!

ఈ ఆలస్యం వలన గ్రామపంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ లు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్.

1) 73, 74 వ రాజ్యాంగ సవరణ చట్టాలలోని ఆర్టికల్ 243 లో పేర్కొన్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 5 వ రాష్ట్ర ఆర్థిక కమిషన్ ఏర్పాటు చేసి దాని ప్రకారం స్థానిక ప్రభుత్వాలయిన గ్రామ పంచాయతీలకు, మండల, జిల్లా పరిషత్ లకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు రాష్ట్రప్రభుత్వం ఇవ్వవలసిన వాటా నిధులను తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము – రాజేంద్ర ప్రసాద్

2) అలాగే 4 వ రాష్ట్ర ఆర్థిక కమిషన్ నివేదికను శాసనసభ, శాసన మండలి ల ముందు ఉంచి వెంటనే ఆమోదించి దానిని అమలు పరిచి దాని ప్రకారం మా స్థానిక ప్రభుత్వాలకు వాటా నిధులను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయుచున్నాము.

3) ఈ 4, 5 వ రాష్ట్ర ఆర్థిక సంఘాల ఏర్పాటులో, అమలులో రాష్ట్ర ప్రభుత్వం కావాలని చేస్తున్న జాప్యం వలన మా స్థానిక ప్రభుత్వాలు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతున్నాయి – రాజేంద్ర ప్రసాద్.

4) రాష్ట్ర ఆర్థిక సంఘం ను అమలు చేయకపోవడం, నియమించ కపోవడం 73 వ రాజ్యాంగ సవరణ చట్టం లోని ఆర్టికల్ 243 కు వ్యతిరేకం. ఇది రాజ్యాంగ విరుద్ధం.

5) మా స్థానిక ప్రభుత్వాలకు నిధులు ఎగ్గొట్టడం కోసమే కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇలా దురుద్దేశంతో రాష్ట్ర ఆర్థిక సంఘాల సిఫార్సులను అమలు చేయడం లేదు.

6) గత 3 వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఇవ్వవలసిన 2019 నుంచి 2022 వరకు సుమారు రూ,, 4000 కోట్ల రూపాయలను మా గ్రామ పంచాయతీలకు, మండల, జిల్లా పరిషత్ లకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఎగకోట్టింది. వెంటనే ఆ 4 సంవత్సరాలకు చెందిన సుమారు రూ,, 4000 వేల కోట్లు మా స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము – రాజేంద్ర ప్రసాద్

7) అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక సంఘాలను ఏర్పాటు చేసి, అమలు చేయకపోవడం వలన కేంద్ర ప్రభుత్వం 15 వ కేంద్ర ఆర్థిక సంఘం నిధులను 2021- 22 సం,, లకు చెందిన రెండో క్వార్టర్ నిధులు 969 కోట్లు మరియు 2022- 23 సం,, లకు చెందిన రూ,, 2020 కోట్ల నిధులను మా స్థానిక సంస్థలకు విడుదల చేయకుండా ఆపి వేసినది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక సంఘం ను ఏర్పాటు చేసి అమలు చేస్తేనే కేంద్ర ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వంలో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి లో చలనం లేకపోవడం సిగ్గుచేటైన విషయం.

8) రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా మా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకునిధులు విడుదల చేయకపోవడం వలన కేంద్ర ఆర్థిక సంఘం నిధులు దారి మళ్ళించడం వలన మా గ్రామీణ,పట్టణ ప్రజలకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు కల్పించలేక సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉత్సవ విగ్రహాలు లాగా మిగిలిపోయి ప్రజల చేత నిందించ బడుతున్నారు.

9) కనుక 4 వ రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేసి, 5 వ రాష్ట్ర ఆర్థిక సంఘం ను ఏర్పాటు చేసి వాటి ప్రకారం మా స్థానిక ప్రభుత్వాలకు నిధులను గత 4 సం,,లవి చెందిన బకాయిల నిధులు సుమారు రూ,, 4000 కోట్లను వెంటనే విడుదల చేసి, కేంద్ర నుంచి రావాల్సిన 15 వ ఆర్థిక సంఘం నిధుల బకాయిలు మొత్తం రూ,, 2989 కోట్లను కేంద్ర ప్రభుత్వం నుంచి రప్పించి మా స్థానిక ప్రభుత్వాలకు తక్షణమే ఆ నిధులను ఇవ్వవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయుచున్నాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here