5 రోజుల్లో 2.98రూ..లక్షల కోట్లు లాభం

0
2

 దేశంలోనే అత్యంత విలువైన టాప్‌-10 కంపెనీలు గత వారం దుమ్మురేపాయి. వీటి మార్కెట్‌ విలువ ఐదు రోజుల్లో ఏకంగా రూ.2.98 లక్షల కోట్లు పెరిగింది

 దేశంలోనే అత్యంత విలువైన టాప్‌-10 కంపెనీలు గత వారం దుమ్మురేపాయి. స్టాక్‌ మార్కెట్లు వరుసగా లాభపడటంతో వీటి మార్కెట్‌ విలువ ఐదు రోజుల్లో ఏకంగా రూ.2.98 లక్షల కోట్లు పెరిగింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌ మార్కెట్ లీడర్లుగా ఉన్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ వారంలోనే 2,311 పాయింట్ల మేర లాభపడింది. టాప్‌-10 కంపెనీల్లో ఎల్‌ఐసీని మినహాయిస్తే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇన్ఫోసిస్‌, హిందుస్థాన్ యునీలివర్‌, ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్‌ క్యాపిటల్‌ పెరిగింది.

రిలయన్స్‌, టీసీఎస్‌ దూకుడు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ గత వారం రూ.68,564 కోట్లు పెరిగి రూ.16,93,245 కోట్లకు చేరుకుంది. సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టీసీఎస్‌ రూ.64,929 కోట్లు లాభపడింది. మార్కెట్‌ విలువ రూ.11,60,285 లక్షల కోట్లకు చేరుకుంది. ఐసీఐసీఐ బ్యాంకు రూ.34,028 కోట్లు పెరగడంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.5,56,526 కోట్లకు ఎగిసింది. మరో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఇన్ఫోసిస్‌ రూ.31,893 కోట్లు లాభపడటంతో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.6,33,793 కోట్లకు చేరుకుంది.

ప్చ్‌.. ఎల్‌ఐసీ!

అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ చివరి వారం రూ.30,968 కోట్లు లాభపడటంతో మార్కెట్‌ విలువ రూ.4,58,457 కోట్లకు చేరుకుంది. బజాజ్‌ ఫైనాన్స్‌ రూ.20,636 కోట్లు లాభపడి రూ.3,78,774 కోట్లకు ఎగిసింది. హిందుస్థాన్‌ యునీలివర్‌ రూ.16,811 కోట్లతో రూ.6,20,362 కోట్లకు పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ విలువ రూ.16,110 కోట్లు పెరిగి రూ.7,73,770 కోట్లకు చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ విలువ రూ.14,579 కోట్లతో రూ.4,16,701 కోట్లకు పెరిగింది. ఎల్‌ఐసీ విలువ మాత్రం రూ.12,396 కోట్లు తగ్గి రూ.4,35,760 కోట్లకు వచ్చింది.

టాప్‌-10 జాబితా

టాప్‌-10 కంపెనీల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇన్ఫోసిస్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, ఐసీఐసీఐ బ్యాంకు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎల్‌ఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్‌ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here