93 మంది హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులు..

0
5

ఒంగోలు జిల్లాలోని 93 మంది హెడ్మాస్టర్లకు డీఈవో బి.విజయభాస్కర్ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు .

జగనన్న విద్యాకానుక కిట్లని అందుకుని కూడా యాప్లో బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ విద్యార్థులతో చేయించలేదని , నిర్లక్ష్యం ప్రదర్శించిన హెడ్మాస్టర్లకు నోటీసులు జారీచేశామని చెప్పారు .

సోమవారంలోగా 75 శాతం బయో మెట్రిక్ వేయించని ప్రధానోపాధ్యాయులు , సీఆర్పీలపై చర్యలు ఉంటాయన్నారు .

పాఠ్యపుస్తకాలు పాఠశాలల్లో నిల్వ ఉంచకుండా , తక్షణమే విద్యార్థులకు అందించాల ని , ఎక్కడైనా పాఠ్యపుస్తకాల నిల్వలు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు .

ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాలల్లో నిర్దేశించిన షెడ్యూలు ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here