జక్కన్నకీ అరుదైన గౌర‌వం..టోరంటో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో భాగం… 

0
11
  • టాలీవుడ్ సినిమాను బాహుబ‌లి తో ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లిన ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌ రాజ‌మౌళి సినిమాలో సాంకేతిక‌తోనే కాదు. వ‌సూళ్ల ప‌రంగానూ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గ‌ర సెన్సేష‌న్‌ను క్రియేట్ చేసింది. రీసెంట్‌గా ఆయ‌న డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ కూడా అంచనాల‌ను అందుకుంది. తెలుగు సినిమాకు గ‌ర్వ‌కార‌ణంగా నిలిచిన రాజ‌మౌళికి ఇప్పుడు అరుదైన గౌర‌వం ద‌క్కింది. అదేంటంటే.. ఆయ‌న టోరంటో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ 2022 లో భాగం కాబోతున్నారు.
  • ఈ విష‌యాన్ని స్వ‌యంగా టిఫ్ నిర్వాహ‌క‌కులు తెలియ‌జేశారు. దానికి సంబంధించి హాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో రాజ‌మౌళి చ‌ర్చా వేదిక‌లో పాల్గొన్నారు. టోరంటోలో సెప్టెంబ‌ర్ 8 నుంచి 18 వ‌ర‌కు ఈ అవార్డ్ వేడుక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. మేకింగ్ ప‌రంగా, సాంకేతిక ప‌రంగా రాజ‌మౌళి తెలుగు సినిమాను మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లారు. ఆయ‌న గ‌త చిత్రం ఆర్ఆర్ఆర్ కూడా రూ. 1200 కోట్ల‌ను వ‌సూలు చేసిన సంగ‌తి తెలిసిందే.
  • ప్ర‌స్తుతం రాజ‌మౌళి.. సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ తో మ‌రో భారీ బ‌డ్జెట్ మూవీని రూపొందించ‌నున్నారు. దుర్గా ఆర్ట్స్ అధినేత కె.ఎల్‌.నారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ‌మౌళి త‌న తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్‌ తో క‌లిసి మ‌హేష్ కోసం క‌థ‌ను రూపొదిస్తున్నారు. సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు ఆఫ్రికా అడవుల నేప‌థ్యంలో మూవీని తెర‌కెక్కించేలా క‌థ‌ను సిద్ధం చేస్తున్నార‌ట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here