ఆసియా కప్‌ ముంగిట భారత్‌కి ఎదురుదెబ్బ..

0
8

Harshal Patel Injury: ఆసియా కప్‌కి భారత్ జట్టుని సోమవారం సెలెక్టర్లు ఎంపిక చేయనున్నారు. కానీ.. గాయం కారణంగా ఈ సెలెక్షన్‌కి హర్షల్ పటేల్ దూరంగా ఉండనున్నాడు.

  • యూఏఈ వేదికగా ఈ నెల 27 నుంచి ఆసియా కప్‌ ప్రారంభంకానుండగా.. భారత్ జట్టు తన ఫస్ట్ మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. కానీ.. టోర్నీ ముంగిట భారత్ జట్టుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీ20 స్పెషలిస్ట్ బౌలర్‌గా కితాబులు అందుకుంటున్న ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్‌కి తాజాగా గాయమైంది. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో ఆడుతున్న హర్షల్ పటేల్.. శనివారం ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టీ20కి గాయం కారణంగా దూరంగా ఉండిపోయాడు.

  • నాలుగో టీ20 కోసం ప్రాక్టీస్ సెషన్‌లో బౌలింగ్ చేస్తుండగా.. హర్షల్ పటేల్‌ పక్కటెముకలకి గాయమైంది. దాంతో.. గాయం తీవ్రత దృష్ట్యా అతను ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకూ జరగనున్న ఆసియా కప్‌‌కి దూరమవడం లాంఛనంగానే కనిపిస్తోంది. అలానే ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకూ జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లోనూ అతను ఆడటం సందేహమే!
  • 2021, నవంబరులో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన హర్షల్ పటేల్.. ఇప్పటి వరకూ 17 మ్యాచ్‌లాడి 23 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 4/25. మిడిల్ ఓవర్లలో భాగస్వామ్యాల్ని విడదీయడంలో దిట్టగా పేరొందిన హర్షల్ పటేల్.. ఆసియా కప్‌ కప్‌కి దూరమవడం భారత్ జట్టుకి గట్టి ఎదురుదెబ్బ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here