గుంటూరు: టీచర్ మందలించడాన్ని అవమానంగా భావించిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరులో సోమవారం జరిగింది. గుంటూరులోని నల్లచెరువు మున్సిపల్ స్కూల్లో ఆకాష్ 9వ తరగతి చదువుతున్నాడు. చదువు పై శ్రద్ధ పెట్టకుంటే టీసీ తీసుకుని వెళ్లి పోవాలంటూ టీచర్ మందలించారు. మధ్యాహ్నం భోజనం చేస్తుండగా ఆకాష్ భోజనం ప్లేట్ ను టీచర్ లాగేశారు. దీన్ని అవమానంగా భావించిన ఆకాష్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.