– ఎమ్మెల్యే అనంత చొరవతో పదేళ్ల నిరీక్షణకు తెర
– ‘గడప గడపలో’నే ఆధార్‌కార్డు అందించిన ఎమ్మెల్యే
– హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా పూర్తి చేసిన సిబ్బంది
- ఆధార్.. ఇప్పుడు ఏ సంక్షేమ పథకం కోసమైనా ఎంతో కీలకం. అలాంటి ఆధార్ కార్డు కోసం జనశక్తి నగర్‌కు చెందిన “డేవిడ్ జయరాజు “పదేళ్లుగా పడరాని పాట్లు పడుతున్నాడు. ఎక్కడికి వెళ్లినా సాంకేతిక కారణం ఉందని చెబుతుండడంతో ఆధార్ కార్డు తీసుకోలేకపోయారు. సోమవారం జనశక్తి నగర్లో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ నిర్వహించారు.
- ఈ సందర్భంగా డేవిడ్ జయరాజు ఎమ్మెల్యేను కలిసి తన సమస్యను వివరించాడు. తమిళనాడుకు చెందిన తాను ఆరేళ్ల పాటు చిత్తూరు జిల్లాలో, ఆ తర్వాత అనంతపురంలో నివాసం ఉంటున్నానని తెలిపాడు. పలుమార్లు ఆధార్ ఎన్రోల్మెంట్ చేయించుకున్నా కార్డు రాలేదని తెలియజేశాడు. తక్షణం స్పందించిన ఎమ్మెల్యే అనంత సచివాలయ సిబ్బందితో ఆరా తీశారు. సాంకేతిక సమస్య ఉందని తెలుసుకుని దాన్ని ఎలా అధిగమించాలో ఎమ్మెల్యే తెలియజేశారు. దీంతో సచివాలయ సిబ్బంది డేవిడ్ జయరాజుకు సంబంధించి వివరాలను ఆధార్ టోల్ ఫ్రీ నంబర్ 1947కు కాల్ చేసి తెలియజేశారు. అక్కడి నుంచి వచ్చిన వివరాలతో కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే డేవిడ్ జయరాజుకు ఆధార్ కార్డు వచ్చేలా చూశారు.
- అనంతరం స్థానికంగా ఉన్న సచివాలయంలో కార్డు ప్రింట్ తీసి గడప గడపకు మన ప్రభుత్వం జరుగుతుండగానే ఎమ్మెల్యే అనంత చేతుల మీదుగా జయరాజుకు అందజేశారు. అనంతరం అక్కడికక్కడే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌ను పూర్తి చేశారు. దీంతో ఎమ్మెల్యే అనంతకు, సచివాలయ సిబ్బందికి జయరాజు కృతజ్ఞతలు తెలియజేశాడు.