ప్రైవేటు ట్రాన్స్ ఫోర్ట్ వాహనం – అశోక్ లైలాండ్ ఢీ,
అశోక్ లైలాండ్ లో బయటపడ్డ అక్రమ రేషన్ బియ్యం.
గోతాలు కూడా మార్చకుండా యథేచ్ఛగా సాగుతున్న అక్రమ రేషన్ బియ్యం రవాణా…!!!.
వినుకొండ:- మండలం రామిరెడ్డి పాలెం వద్ద తెల్లవారుజామున నవత ట్రాన్స్ పోర్ట్ వాహనం – అశోక్ లైలాండ్ వాహనం ఢీ, ఈ సంఘటనలో అనే ట్రాన్స్ పోర్ట్ వాహనం డ్రైవర్ కృష్ణ జిల్లా వాసి ముక్కమల కృష్ణ రావు మృతి చెందినట్లు సమాచారం.
అశోక్ లైలాండ్ వాహనం లో రేషన్ బియ్యం అక్రమంగాతరలిస్తున్నట్లు గుర్తించిన స్థానికులు,అయితే ఈ వాహనంలో వ్యక్తులు ఏవరు లేకపోవడంతో గాయాలతో ఆసుపత్రికి వెళ్లారా… లేక ప్రమాదంలో రేషన్ బియ్యం బయట పడటంతో పరారయ్యారా…??? పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆటో ల ద్వారా యధేచ్ఛగా అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు, ప్రమాదం జరిగిన ఆటో లో బయటపడ్డ రేషన్ బియ్యం, గోతాలు కూడా మార్చకుండా యథేచ్ఛగా సాగుతున్న అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం…
సమాచారం తెలియగనే సంఘటన స్థలానికి చేరుకున్న వినుకొండ SI చెన్నకేశవులు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు