రాజకీయాల్లోకి ఎంట్రీపై రజనీకాంత్ మరో కీలక ప్రకటన..

0
8
  • సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళనాడు గవర్నర్ రవిని కలవడం చర్చనీయాంశమైంది. సుమారు 30నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తుంది.
  • ఈ మీటింగ్ లో రాజకీయాలపై చర్చించినట్లు రజినీ మాట్లాడినప్పటికీ తాను ఆ విషయాలు మీడియాతో పంచుకోవడానికి సిద్ధంగా లేనని అన్నారు. మర్యాదపూర్వకంగా కలుసుకున్నానని పేర్కొన్నారు.
  • రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపినట్లు రజనీకాంత్ వివరించారు. తమిళనాడు, తమిళుల నిజాయతీ, కఠినశ్రమ, ఆధ్మాత్మిక భావజాలం గవర్నర్ ను ఆకర్షించాయని వెల్లడించారు. ఇక కీలకమైన రాజకీయాల్లో ఎంట్రీ గురించి మాట్లాడుతూ అటువంటి ఆలోచన తనకు లేదంటూ సమాధానం ఇచ్చారు.
  • నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన జైలర్.. షూటింగ్ 15న గానీ, 20వ తేదీ గానీ ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
  • 2017లో రాజకీయాల్లోకి వచ్చేందుకు రజనీకాంత్ భారీ ఏర్పాట్లే చేశారు. కొన్నేళ్ల పాటు అదే ప్రయత్నాల్లో ఉండి సడెన్ గా 2020 డిసెంబరులో తన ఆలోచనను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. కొవిడ్ పరిస్థితులు, అనారోగ్య సమస్యల కారణంగా తాను రాజకీయాల్లోకి రావట్లేదంటూ ప్రకటన విడుదల చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here