- విద్యాదీవెన తో నాణ్యమైన విద్య జగనన్న విద్యాదీవెనతోనే మంచి నాణ్యమైన విద్య విద్యార్థులకు లభ్యమౌతుందని శాసన సభ్యులు అన్నా బత్తుని శివకుమార్ అన్నారు, గురువారం రాష్ట్రవ్యాప్తంగా జగనన్న విద్యాదీవెన బాపట్ల జిల్లాకేంద్రంలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రారంభానంతరం తెనాలి కొత్తపెటలో రామకృష్ఞకవి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో తెనాలి అసెంబ్లీ పరిథిలోని తెనాలి మునిసిపాలిటి మండలం మరియు కొల్లిపర మండలముల జగన్న విద్యాదీవెన లబ్దిదారులతో సమావేశం నిర్వహించారు.

- స్వర్గీయ రాజశేఖరరెడ్డి పేద విద్యార్థి మంచి కళాశాల లో చదవుకోవటానికి ఫీజు రీయంబర్స్ మెంట ప్రవేశ పెట్టారని తెలిపారు. ఈసందర్భంగా అసెబ్లీపరిథిలోని 5402మంది విద్యార్ధులకు 3.85కోట్ల మొత్తం సంబంథిత విద్యార్థుల తల్లుల ఖాతాలో జమకాబడినవని , డబ్బును విత్రా డ్రా చేసి సంబంథిత కళాశాలకెళ్ళి విద్యార్థి చదువుతీరు హాజరు చూసి ఫీజు నూ చెల్లించాలని కోరారు.తెనాలి అసెంబ్లి పరిథిలో యస్సీ1574 యస్టీ157 బిసి1672 కాపు650 మైనార్టీ 485 ఆర్ఠిక వెనుకబడిన వారికి812మందికి లబ్థి చేకూరిదని, తాము ఎన్నికల మానిఫెస్టోలో అన్న మాటలు అక్షరాల అమలు చేస్తామని తెలిపారు.
- ఈ సందర్భంగా లబ్దిదారులతో జరిగిన ముఖాముఖిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలగురించి ఆరాతీశారు. పథకాలు ఎవరైన అందనివారుంటే “గడపగడపకూ మనప్రభుత్వంలో తాను పర్యటించినపుడు ఫిర్యాదు చేయాలన్నారు. సహాయ సంక్షేమ అథికారి శైలజ అద్యక్షతన జరిగినఈ సమావేశంలో తెనాలి ఛైర్మన్ ఖాలేదానశీం మండల అద్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాస రావు, వైస్ ఛైర్మన్ గుంటూరు కోటేశ్వరావు,రాష్ట్రవిత్త సంస్థ డైరక్టర్ మన్నవ ప్రభాకర్ వైసిపి నాయకులు తాడిబోయిన రమేష్ కఠారి హరీష్ పలువురు సర్పంచుల యం. పి.టి సి.లు ఇందు పాల్గొన్నారు.