రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డిని తరిమికొట్టాలి ■అబద్దాలతో అధికారంలోకి జగన్.
చంద్రబాబుతోనే రాష్ట్ర పునర్ నిర్మాణం.
బోడవాడ బాదుడే బాదుడులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్ బాబు.
ప్రజల సొమ్మును దోచుకుని అధికారంలోకి వచ్చి, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్ బాబు అన్నారు. బుధవారం బోడవాడ గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. అక్రమ సంపాదనతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పదవిని కాపాడుకునేందుకు ప్రజల నుంచి అక్రమ సంపాదనలతో దండుకుంటున్నాడని ఆరోపించారు. ఎన్నికల సమయంలో అమలు కాని హామీలను గుప్పించి ప్రజలను నిలువునా మోసం చేశాడన్నారు.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. జగన్ పాలనలో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని… విద్యార్థులకు ఉన్నత చదువులు దూరమయ్యాయన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదన్నారు. ప్రజలను విలువ నా మోసం చేసిన ఘనత చరిత్ర జగన్మోహన్ రెడ్డి దేనన్నారు. పసికందు లాంటి ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాలలో చంద్రబాబు అగ్రగామిగా నిలిపితే… తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాలను కుప్పకూలిచి అట్టడుగు స్థాయికి తీసుకెళ్లారన్నారు.

ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో ప్రథమ స్థానంలో ఉంటే ప్రస్తుతం తీరుగమని స్థితిలో ఉందన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రజలంతా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో నిర్ణయం తీసుకోవాలన్నారు. తోలుత గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ… పన్నుల రూపంలో ప్రజలను బాదుతున్న తీరును వివరిస్తూ కరపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు షేక్ శంషుద్దీన్,కునమనేని బాపుజీ, అప్పలనేని నరేంద్ర, గోరంట్ల రామకృష్ణ, తెలుగు యువత అధ్యక్షులు షేక్ ఫారుక్, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి, నాగరాజు, శివ, శ్రీరామ్ సుబ్బారావు, మామిడిపాక హరిప్రసాద్, వెంకట్, నాగేశ్వరరావు, సాంబశివరావు, చింపయ్య, దొరబాబు, రమేష్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.
