హీరోయిన్‌గానే కాకుండా..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడానికి కూడా రెడీ

0
7

నేషనల్ క్రష్ రష్మిక: స్టార్ హీరోయిన్ రష్మిక ఇటు సౌత్ లో అటు బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంది. వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది. స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉండి ఇటీవల సీతారామం సినిమాలో ఆఫ్రిన్ లాంటి స్పెషల్ క్యారెక్టర్ లో నటించి మెప్పించింది.

సినిమా హిట్ అవ్వడంతో పాటు రష్మిక క్యారెక్టర్ కి కూడా మంచి పేరు వచ్చింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ క్యారెక్టర్ గురించి, తన సినిమాల గురించి మరిన్ని వివరాలు తెలిపింది.

రష్మిక మందన్నా మాట్లాడుతూ.. ”హీరోయిన్‌గానే కాకుండా సినిమాని నడిపించే ఆఫ్రిన్‌ లాంటి క్యారెక్టర్స్ లో నటించేందుకు నేను రెడీ. ఆల్రెడీ కొన్ని సినిమాల్లో అలాంటి పాత్రల్లోనే నటిస్తున్నాను. అలాంటి పాత్రల్లో నటనకి స్కోప్ ఉంటుంది, రిస్క్ కూడా ఉంటుంది. రిస్క్‌ ఉన్నా ఓ నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలి. నటులెవరికైనా ప్రయోగాత్మక చిత్రాలు చేయడం చాలా ముఖ్యం. ఇన్నాళ్లు హీరోయిన్ గానే కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడిప్పుడే నా కంఫర్ట్‌ జోన్‌ దాటి కొన్ని సినిమాలు చేస్తున్నాను.”

”అలాంటి వాటిల్లో నన్ను కొత్తగా చూపించిన ‘సీతారామం’ నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. నా కెరీర్‌లో తొలిసారి ఇలాంటి వైవిధ్యభరిత పాత్రని పోషించాను. ఈ సినిమాలోని వైలెంట్‌ పాత్ర నాకు సవాలు విసిరింది. దాన్ని స్వీకరించి, నటించి నటిగా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇక నాకు తెలుగులో ఛలో సినిమా చేసేటప్పుడే చాలా ఆఫర్స్ వచ్చాయి. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా మొదటి సినిమా రిలీజ్ అవ్వకముందే చాలా అవకాశాలు వస్తున్నాయి. నా హార్డ్ వర్క్ తో పాటు, అదృష్టం వల్లే ఇదంతా” అని తెలిపింది. దీంతో స్పెషల్ క్యారెక్టర్స్ కోసం రష్మికని అప్రోచ్ అవ్వొచ్చని హింట్ ఇచ్చేసింది ఈ నేషనల్ క్రష్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here